Share News

రాజకీయ లబ్ధి కోసం చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ: జగ్గారెడ్డి

ABN , Publish Date - Oct 11 , 2026 | 04:10 PM

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను ఓ మతానికి పరిమితం చేయడం కరెక్ట్ కాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి స్పష్టం చేశారు. చరిత్రని వక్రీకరించి ఛత్రపతి శివాజీని రాజకీయ లబ్ది కోసం బీజేపీ వాడుకుంటుందంటూ మండిపడ్డారు. ఆదివారం సంగారెడ్డి బైపాస్ రోడ్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహా ఏర్పాటుకు ఆయన భూమి పూజ చేశారు.

రాజకీయ లబ్ధి కోసం చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ: జగ్గారెడ్డి
TPCC Working President Jaggareddy

సంగారెడ్డి, అక్టోబర్11: ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను ఓ మతానికి పరిమితం చేయడం కరెక్ట్ కాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి స్పష్టం చేశారు. చరిత్రని వక్రీకరించి ఛత్రపతి శివాజీని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాడుకుంటుందంటూ మండిపడ్డారు. ఆదివారం సంగారెడ్డి బైపాస్ రోడ్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహా ఏర్పాటుకు ఆయన భూమి పూజ చేశారు.


అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ వద్ద ముస్లిం అధికారులు కూడా పని చేశారని గుర్తు చేశారు. ఆయనకు కులం, మతంతో సంబంధం లేదని అన్నారు. రాజ్యంలోని ప్రజల బాగోగులు, రాజ్య భద్రతే శివాజీకి ముఖ్యమని స్పష్టం చేశారు. ఛత్రపతి గొప్ప వీరుడని.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా యువతకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్ జగన్ కేసుల విచారణ వేగవంతం చేయాలి: మంత్రి కొల్లు రవీంద్ర

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ: పవన్ కల్యాణ్

For More TG News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 05:08 PM