Share News

'ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది'.. ముంబైలో నేడు సీజేపీ నిరసనకు పిలుపు

ABN , Publish Date - Oct 11 , 2026 | 02:17 PM

ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలను నిర్బంధించడంపై సీజేపీ సభ్యుడు అజింక్యా షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్ వద్ద నిరసనకు పిలుపునివ్వడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

'ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది'.. ముంబైలో నేడు సీజేపీ నిరసనకు పిలుపు
CJP calls Protest in Mumbai

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో తమ పార్టీ నేతలను, నిరసన కారులను బలవంతంగా నిర్బంధిస్తున్నారని ఆరోపించారు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సభ్యుడు అజింక్యా షిండే. ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ఆయన.. ముంబైలో ఆదివారం నిరసనకు దిగాలని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్ వద్దకు చేరుకోవాలని ఎక్స్ వేదికగా సూచించారు.


'ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా.. దేశాన్ని నియంతృత్వంగా మారుస్తుండటంపై ప్రతి భారతీయుడూ ఆగ్రహంతో ఉన్నారు. నిన్న(శనివారం) ఢిల్లీ, భారతదేశం అంతటా పదివేల మందిని నిర్బంధించిన తీరును ప్రశ్నించకుండా వదిలిపెట్టబోము. ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. మా నాయకులను అరెస్ట్ చేసి, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం ద్వారా ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది' అని షిండే అన్నారు.


కాగా.. ఎన్నికల కమిషన్ తీరు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ సీజేపీ మద్దతుదారులు ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో షిండే తాజా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు శివాజీ పార్క్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్క్ ప్రవేశ ద్వారం సమీపంలో భారీగా పోలీస్ సిబ్బందిని మోహరించారు. శనివారం ముంబై వ్యాప్తంగా జరిగిన ఈ ఆందోళనల్లో పోలీసులు 400 మందికి పైగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలనూ చవండి:

రియాద్ విమానాశ్రయంపై దాడి.. సౌదీకి సాయం గురించి అమెరికా ఆలోచన..

రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. ఖండించిన భారత్

Updated Date - Oct 11 , 2026 | 02:20 PM