Share News

డేటా సెంటర్ల ఏర్పాటులో వాటి భద్రత, గోప్యత కీలకం: మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Oct 11 , 2026 | 03:44 PM

డేటా రక్షణ, గోప్యతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. డేటా గోప్యతను కాపాడటం, డిజిటల్ వ్యవస్థలను సురక్షితంగా ఉంచడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటులో వాటి భద్రత, గోప్యత కీలక అంశాలని ఆయన వివరించారు.

డేటా సెంటర్ల ఏర్పాటులో వాటి భద్రత, గోప్యత కీలకం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, అక్టోబర్ 11: డేటా రక్షణ, గోప్యతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. డేటా గోప్యతను కాపాడటం, డిజిటల్ వ్యవస్థలను సురక్షితంగా ఉంచడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటులో వాటి భద్రత, గోప్యత కీలక అంశాలని ఆయన వివరించారు. ఆదివారం హైదరాబాద్‌లో బిలియన్స్ ఏఐ సెంటర్ (AI Center)ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏఐ సాధనాలను ఉపయోగించేటప్పుడు అవి ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాయో పరిశీలించాల్సి ఉందన్నారు. ఏఐ వినియోగంలో బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.


సాంకేతికతను ఉపయోగించుకోవడంతోపాటు దాని ద్వారా ఎదురయ్యే సవాళ్లపైనా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. డిజిటల్ భద్రతకు ప్రాధాన్యమిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. సంప్రదాయ విద్యా విధానాలకు సాంకేతికతను జోడించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.


విద్యా రంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని అన్నారు. ఏఐ ఆధారిత పరిష్కారాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మరింత మెరుగుపరుస్తాయని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రాక్టీస్, లెర్నింగ్ కోసం ఎడ్యుకేషన్ టెక్నాలజీని వినియోగించుకోవడం సంతోషకరమని చెప్పారు. నీట్ పేపర్ లీక్ తర్వాత .. డేటా లీక్ అరికట్టాల్సిన అవసరం మరింత పెరిగిందని అన్నారు.


ఇంపాక్ట్ -2025 సర్వే ప్రకారం.. ఎడ్యుకేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న పిల్లల్లో 77 శాతం మంది ప్రాక్టీస్, లెర్నింగ్ కోసం వినియోగిస్తున్నారని వివరించారు. విద్యా సంస్థల్లో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందుబాటులోకి రావాల్సి ఉందని అన్నారు. డిజిటల్ వ్యవస్థల భద్రత, డేటా విశ్లేషణలో ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్ జగన్ కేసుల విచారణ వేగవంతం చేయాలి: మంత్రి కొల్లు రవీంద్ర

'ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది'.. ముంబైలో నేడు సీజేపీ నిరసనకు పిలుపు

For More TG News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 03:58 PM