Share News

నలుగురు హిందూ రక్షా దళ్ కార్యకర్తల అరెస్టు

ABN , Publish Date - Oct 11 , 2026 | 03:40 PM

దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన సమయంలో విద్యార్థులు, మహిళలపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై నలుగురు హిందూ రక్షా దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ఓటర్ల పేర్లను తొలగించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈఓ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చి విషయం తెలిసిందే.

నలుగురు హిందూ రక్షా దళ్ కార్యకర్తల అరెస్టు
students attacked during protest in delhi

ఇంటర్‌నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన సమయంలో విద్యార్థులు, మహిళలపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై నలుగురు హిందూ రక్షా దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ఓటర్ల పేర్లను తొలగించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈఓ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చి విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలోని డీడీయూ మార్గ్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు, మహిళలపై కొందరు వ్యక్తులు భౌతిక దాడికి పాల్పడ్డారు. మహిళా విద్యార్థులను తోసేయడం, అసభ్యంగా తాకడం వంటివి చేశారు.


తాము హిందూ రక్షా దళ్ కార్యకర్తలమని చెప్పుకున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ ఘటనను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేశారు. వారిని రమణ్ సైని (50), వివేకానంద్ అలియాస్ వివేక్ (32), కపిల్ కుమార్ (27), రవీందర్ సింగ్ అలియాస్ గోవింద్ హిందూ (35) గా గుర్తించారు. కాగా.. విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటనపై ఎలాంటి అధికారిక ఫిర్యాదు రాలేదని, ఆ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో తామే సుమోటోగా తీసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టి విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాగా.. సీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అంతకుముందే భద్రతా బలగాలు ఢిల్లీని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఎక్కడికక్కడ నగరాన్ని నిర్బంధించాయి. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులపై దాడి ఎలా జరిగిందని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నలు లేవనెత్తారు.


ఈ వార్తలనూ చవండి:

రియాద్ విమానాశ్రయంపై దాడి.. సౌదీకి సాయం గురించి అమెరికా ఆలోచన..

రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. ఖండించిన భారత్

Updated Date - Oct 11 , 2026 | 04:06 PM