Share News

బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ ఖాన్ విడుదల.. ‘జై హింద్’ అంటూ నినాదాలు..

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:39 PM

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్, ఆయన భాగస్వామి లేఖా వాషింగ్టన్‌ను పోలీసులు విడుదల చేశారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసనలో వారు పాల్గొన్నారు. దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వదిలిపెట్టారు.

బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ ఖాన్ విడుదల.. ‘జై హింద్’ అంటూ నినాదాలు..
Imran Khan Release

మహారాష్ట్ర: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్, ఆయన భాగస్వామి లేఖా వాషింగ్టన్‌ను ముంబై పోలీసులు విడుదల చేశారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) శనివారం నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నిరసనలో భాగంగా ముంబైలోని క్రాంతి మైదాన్ వద్ద ఇమ్రాన్ ఖాన్, ఆయన భాగస్వామి లేఖా వాషింగ్టన్, బంధువు జైన్ మేరీ పాల్గొన్నారు. దీంతో ఆ ముగ్గురినీ నిన్న సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


అయితే, గంటల తరబడి వారిని పోలీసు వాహనంలో తిప్పిన తర్వాత అదే రోజు రాత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ‘జై హింద్’ అంటూ స్పందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నిరసనలో తాను ఏ సంస్థ తరఫున కాకుండా.. ఒక పౌరుడిగా పాల్గొన్నానని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఆయన విడుదల, పోలీసులతో జరిగిన సంభాషణలు ప్రస్తుతం సినీ అభిమానులు, నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరోవైపు, పోలీసుల అదుపులో ఉన్నప్పుడు తన అనుభవాన్ని ఇమ్రాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. పోలీసు వాహనంలో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘చూస్తుంటే నేను డ్రైవ్‌కు వెళ్తున్నట్లుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అలాగే, తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో స్పష్టంగా తెలియలేదని పేర్కొన్నారు.


కాగా, విడుదలైన తర్వాత ఇమ్రాన్ ఖాన్, లేఖా వాషింగ్టన్ ఇంటికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకడం కష్టమైందని లేఖా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. క్యాబ్ దొరకకపోవడంతో ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను పంచుకున్నారు. ఇమ్రాన్ బంధువు జైన్ మేరీ కూడా పోలీసుల వాహనంలో ఉన్న వీడియోను షేర్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

మా విషయాల్లో జోక్యం వద్దు: ఐరాస మానవహక్కుల సంఘంపై భారత్ ఫైర్

ధ్రువ్ రాఠీ విడుదల.. మళ్లీ నిరసనకు వెళ్తే అరెస్టు చేస్తామని హెచ్చరిక

Updated Date - Oct 11 , 2026 | 01:24 PM