Share News

ధ్రువ్ రాఠీ విడుదల.. మళ్లీ నిరసనకు వెళ్తే అరెస్టు చేస్తామని హెచ్చరిక

ABN , Publish Date - Oct 11 , 2026 | 10:54 AM

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు సిద్ధమైన ఆయనను శనివారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, అదే రోజు అర్ధరాత్రి తర్వాత విడుదల చేశారు.

ధ్రువ్ రాఠీ విడుదల.. మళ్లీ నిరసనకు వెళ్తే అరెస్టు చేస్తామని హెచ్చరిక
Dhruv Rathee

న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు సిద్ధమైన ఆయనను శనివారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, అదే రోజు అర్ధరాత్రి తర్వాత విడుదల చేశారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, మళ్లీ నిరసన ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే మరోసారి అదుపులోకి తీసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.


కాగా, హర్యానాలోని గురుగ్రామ్ సెక్టార్ 56లోని ధ్రువ్ రాఠీ ఇంటికి శనివారం ఉదయం పోలీసులు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను నిరసనలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు అదుపులోకి తీసుకున్నారు. సుమారు మూడు క్రైమ్ బ్రాంచ్ బృందాలు ధ్రువ్ ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో సుమారు గంటపాటు విచారించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి లేదని, ఢిల్లీలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు ముందుగానే పేర్కొన్నారు. అయినప్పటికీ, నిరసనలో పాల్గొంటానని ధ్రవ్ సోషల్ మీడియాలో పేర్కొనడంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ అక్టోబర్ 10న సీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిరసనకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. జంతర్ మంతర్‌కు ఆందోళనకారులు చేరకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలువురు నేతలను అరెస్టు చేశారు. వేల మంది సీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ధ్రువ్ రాఠీ విడుదల.. మళ్లీ నిరసనకు వెళ్తే అరెస్టు చేస్తామని హెచ్చరిక

అభిజీత్ దీప్కే విడుదల.. కాక్రోచ్‌లకు అంతం లేదన్న సీజేపీ

Updated Date - Oct 11 , 2026 | 12:07 PM