అభిజీత్ దీప్కే విడుదల.. కాక్రోచ్‌లకు అంతం లేదన్న సీజేపీ
ABN , Publish Date - Oct 11 , 2026 | 11:05 AM
పోలీసుల అదుపులో ఉన్న కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సీజేపీ కోకన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఆదివారం విడుదలయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: పోలీసుల అదుపులో ఉన్న కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సీజేపీ కోకన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఆదివారం విడుదలయ్యారు. న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సీఈసీకి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమైన వారిని ఢిల్లీ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ముగ్గురినీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. శాంతికి విఘాతం కలిగేలా ఎలాంటి చర్యలనూ చేపట్టబోమని వారి నుంచి హామీ తీసుకున్నాక మెజిస్ట్రేట్ వారిని విడుదల చేశారు. తమ నాయకులు విడుదల కావడంపై సీజేపీ హర్షం వ్యక్తం చేసింది. కాక్రోచ్‌లకు అంతం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేసింది.
ఓటర్ జాబితా ప్రక్షాళనకు ఉద్దేశించిన సర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న సీజేపీ నేతలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ అక్టోబర్ 10న జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, కార్యక్రమం ప్రారంభమయ్యేలోపే పోలీసులు 7 వేల మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు అర్వింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, పినరయి విజయన్, మణిక్ సర్కార్‌లను అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ ధ్రువ్ రాఠీని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, దీప్కే, దాస్, రాంకా మినహా మిగిలిన వారందరినీ శనివారం రాత్రి విడుదల చేశారు. జర్మన్ పాస్‌పోర్టు ఉన్నట్టు చెబుతున్న రాఠీ కూడా విడుదలయ్యారు. నేడు సీజేపీ నేతలు కూడా విడుదలయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆ విమానం దగ్గరకు కూడా మమల్ని రానీయరు: భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్
చెన్నైకి నేడు ప్రధాని మోదీ.. రూ.13 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం..