Share News

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి...

ABN , Publish Date - Feb 28 , 2026 | 09:37 AM

ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం మైసంపల్లి పెద్దమ్మ ఆలయం, వెంకటాపూర్‌ హనుమాన్‌ ఆలయం వార్షికోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు.

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి...

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

నంగునూరు(సిద్దిపేట): ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం మైసంపల్లి పెద్దమ్మ ఆలయం, వెంకటాపూర్‌ హనుమాన్‌ ఆలయం వార్షికోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. గతంలో సిద్దిపేటలో 8 వేల ఎకరాల్లో పంటలు సాగు అయ్యేవని, కాళేశ్వరం నీళ్లు వచ్చిన తర్వాత 80 వేల ఎకరాల్లో వరి సాగు అవుతుందన్న విషయం మర్చిపోవద్దన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక ఎకరాకు నీళ్లయిన అందుతున్నాయా అని సీఎం రేవంత్‌ అంటున్నాడని, ఆయనను ఏమనాలో అర్థం కావడం లేదన్నారు.


sdp1.2.jpgమైసంపల్లి గ్రామానికి వచ్చి చూస్తే కాలేశ్వరం నీళ్లు గలగల పారేది కనపడుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతులను విస్మరించిందన్నారు. మత్స్యకారులు, ముదిరాజుల సంక్షేమం కోసం అనేక చెరువులలో చేపలు వేసి కులవృత్తులకు ఉపాధి కల్పించిన ఘనత తమదేనని చెప్పారు. ఆయన వెంట సర్పంచ్‌లు సోమిరెడ్డి, నరేష్‏రెడ్డి, సంతోష్‏రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అనగోని లింగంగౌడ్‌, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఎడ్ల సోమిరెడ్డి, తదితరులు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘రైతు భరోసా’పై మోసగించిన కాంగ్రెస్‌

కవిత విషయంలో తప్పు చేశామా?

Read Latest Telangana News and National News

Updated Date - Feb 28 , 2026 | 09:37 AM