హైదరాబాద్ అభివృద్ధి కాగితాలకే పరిమితం
ABN , Publish Date - Feb 28 , 2026 | 08:44 AM
ఎవరూ ఊహించని రీతిలో హైదరాబాద్ విస్తరిస్తున్నా.. అభివృద్ధి మాత్రం కాగితాలకే పరిమితతమైందని అని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి విమర్శించారు.
గత పాలకులు, ప్రస్తుత ప్రభుత్వ పాలనలోనూ ఇదేతీరు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
పలు డివిజన్లలో బస్తీబాట
కార్పొరేషన్‌ల మేయర్ పదవులను కాంగ్రెస్, ఎంఐఎం పంచుకుంటాయని విమర్శ
హైదరాబాద్: ఎవరూ ఊహించని రీతిలో హైదరాబాద్ విస్తరిస్తున్నా.. అభివృద్ధి మాత్రం కాగితాలకే పరిమితతమైందని అని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి విమర్శించారు. భారత రాష్ట్ర సమితి హయాంలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌ను సింగపూర్ లండన్ లా మారుస్తామని చెప్పినా నగరాభివృద్ది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ నియోజక వర్గంలోని పలు డివిజన్‌లో బస్తీబాట కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. మెట్టుగూడ డివిజన్.. దోభీఘాట్ డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఈ డివిజన్‌లోనే పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించారు. అడ్డగుట్టలోనూ పర్యటించి స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.
అనంతరం చిలకలగూడ డివిజన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తూ కంటతడి పెట్టుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచే తెలంగాణ రాష్ట్రానికి సుమారు 70 శాతం ఆదాయం వస్తుందని, 7 శాతం కూడా నగరాభివృద్ధికి ఖర్చు చేయడం లేదన్నారు. కాలనీలు, బస్తీల్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. చిన్న వర్షానికే రోడ్లు నదుల్లా మారుతున్నాయన్నారు. పైప్‌లైన్ మార్చాలని అధూనిక సాంకేతికత వినియోగించాలని ఎన్నో సార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ తాను అడ్డుకుంటున్నానవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణలతో వాస్తవం లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఎంఎంటీఎస్ ఫేజ్ 02 ప్రారంభించామన్నారు. రూ.600 కోట్లతో హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు రైల్వే పనులు ఎంఎంటీఎస్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్ అనుమతులు రావాల్సి ఉందన్నారు. కల్వకుంట్ల తారక రామారావు, కేసీఆర్, రేవెంత్‌రెడ్డిలు అభివృద్ధి కంటే రియల్ ఎస్టేట్‌పై దృష్టితో ఆలోచిస్తున్నారని విమర్శించారు. కార్పొరేషన్‌ల మేయర్ పదవులను కాంగ్రెస్, ఎంఐఎం పంచుకుంటాయని విమర్శించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీకారెడ్డి, సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్‌గౌడ్, మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, నాయకులు కందాడి నాగేశ్వర్‌రెడ్డి, కనకట్ల హరి, ప్రభుగుప్త అజయ్‌లు పాల్గొన్నారు.
వృద్ధురాలికి పలకరింపు
హరిహర కళాభవన్: మెట్టుగూడ డివిజన్ దూద్‌బావి డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్య తెలుసుకోవటానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం విచ్చేశారు. అనంతరం తిరిగి వెళుతు ఇంటి బయట విశ్రాంతిగా కూర్చున్న కల్యాణం యాదమ్మ(85)ను పలుకరించి, ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఆమెను టీవీ చూస్తావా అని సరదాగా అడగ్గా చూస్తానని తెలిపింది. అనంతరం మంత్రి యాదమ్మ ఆశీర్వాదం తీకునికుని ఆమెను శాలువాతో సత్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘రైతు భరోసా’పై మోసగించిన కాంగ్రెస్
Read Latest Telangana News and National News