యుద్దం కాదు.. శాంతిని కోరుకుందాం
ABN , Publish Date - Mar 11 , 2026 | 10:20 AM
గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ఆందోళనను కలిగిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
పేద, మధ్యతరగతి వర్గాలపై ధరల ప్రభావం
ముస్లింలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్
సంగారెడ్డి ఇఫ్తార్ విందులో హరీశ్‌రావు
సంగారెడ్డి: గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ఆందోళనను కలిగిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు(Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి ఆయన సంగారెడ్డిలో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరై మాట్లాడారు. యుద్ద ప్రభావంతో నిరపరాధ చిన్న పిల్లలు, సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను చూస్తే బాధ కలుగుతోందని అన్నారు. త్వరలోనే యుద్ధ పరిస్థితులు ముగిసి ప్రపంచంలో శాంతి నెలకొనాలని దేవుడిని ప్రార్థించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు, తెలంగాణ వాసులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు.
యుద్ద సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద, మధ్యతరగతి వర్గాలు ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తుచేశారు. ముస్లిం సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఇమామ్, మౌజన్‌లకు ఇవ్వాల్సిన నెలసరి భత్యాన్ని ఎగ్గొట్టారని విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు రూ.5వేల సహాయం అందించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News