Share News

భార్యను హత్య చేయడానికి తుపాకీ కొనుగోలు

ABN , Publish Date - Mar 11 , 2026 | 09:41 AM

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తెలిసిన వ్యక్తుల ద్వారా బిహార్‌ నుంచి తుపాకీ, ఆరు బుల్లెట్లు కొనుగోలు చేశాడు.

భార్యను హత్య చేయడానికి తుపాకీ కొనుగోలు

  • మర్డర్‌ స్కెచ్‌ను భగ్నం చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తెలిసిన వ్యక్తుల ద్వారా బిహార్‌ నుంచి తుపాకీ, ఆరు బుల్లెట్లు కొనుగోలు చేశాడు. తుపాకీ పేల్చడంపై ప్రాక్టీస్‌ చేశాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న సిటీ చార్మినార్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. అతనితోపాటు.. అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి తుపాకీ, ఆరు బుల్లెట్లు, ఒక మ్యాగజైన్‌ స్వాధీనం చేసుకున్నారు.


టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ అందె శ్రీనివాస్‌, అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి మారుతీనగర్‌(Malkajgiri Marutinagar)కు చెందిన దామర అరుణ్‌కుమార్‌ (48) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ఆయన మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె చెల్లెలు నిషిత రాణిని 2019లో రెండవ వివాహం చేసుకున్నాడు. నిషితరాణికి ఇతరులతో సంబంధాలు ఉన్నట్లు అరుణ్‌కుమార్‌ అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా తన భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.


city5.jpgనవంబర్‌ 2005లో తనకు తెలిసిన జవహర్‌నగర్‌కు చెందిన మహమ్మద్‌ అబ్బుని కలిసి ఒక తుపాకీ కావాలని కోరాడు. దాంతో అబ్బు.. యాకుత్‌పురకు చెందిన మీర్‌ ముజామిల్‌ ఆలీఖాన్‌ ద్వారా బీహార్‌ నుంచి తెప్పించిన దేశవాళీ తుపాకీని అరుణ్‌కు రూ. 1,10,000కు ఇప్పించాడు. అరుణ్‌ తుపాకీతో ఈ నెల 9న తన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. అంతకు రెండు రోజుల ముందు తన పొలంలో పైరింగ్‌ ప్రాక్టీస్‌ చేయడంతో విషయం పోలీసులకు తెలిసి పట్టుకున్నారు. ముగ్గురిరి అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సల్మాన్‌, తాబిష్‌ పరారీలో ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘రాయనపాడు’ రాజసం!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 11 , 2026 | 09:41 AM