వయసు 28.. దొంగతనాలు 88
ABN , Publish Date - Mar 11 , 2026 | 07:57 AM
రాత్రి వేళల్లో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఘరానా దొంగలను సిటీ చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ముగ్గురు ఘరానా దొంగలు అరెస్ట్
హైదరాబాద్ సిటీ: రాత్రి వేళల్లో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఘరానా దొంగలను సిటీ చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు ఒక రిసీవర్‌ను అరెస్టు చేసి వారి నుంచి 65 గ్రాముల బంగారు ఆభరణాలు, 400 గ్రాముల వెండి, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ రూ.13 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వారిని పట్టుకోవడం ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నాలుగు నాన్‌బెయిలబుల్ కేసులు క్లియర్ చేసినట్లు వెల్లడించారు.
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఇటీవల రాత్రిపూట వరుస చోరీలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు పాత నేరస్థులుగా గుర్తించిన చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారి ఆచూకీ కోసం గాలించారు. కీసర పోలీసులతో కలిసి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారు అంబర్‌పేట్‌కు చెందిన మునితాని అమర్ రాజ్‌కుమార్‌రెడ్డి అలియాస్ డాల్, షాహీన్ నగర్, న్యూ బాబా నగర్‌కు చెందిన అబ్దుల్ లతీఫ్ ఖాన్ అలియాస్ సల్మాన్ అలియాస్ గుజ్జా, మొహమ్మద్ నగర్ బండ్లగూడకు చెందిన గులాం హుస్సేన్ ఖాన్ అలియాస్ రెహాన్ ఖాన్‌గా గుర్తించారు.
వారి వద్ద దొంగ బంగారాన్ని కొనుగోలు చేస్తున్న గోపాలపురం ఉప్పుగూడకు ప్రణీత్ చారి అలియాస్ లడ్డూను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌రెడ్డి 28 ఏళ్ల వయసులో సుమారు 88 ఇళ్ల దొంగతనాలు, ఇతర ఆస్తి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై రెండుసార్లు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అయినా మారలేదు. స్నేహితులు అబ్దుల్ లతీఫ్ ఖాన్, గులాం హుేస్సన్ ఖాన్‌లతో కలిసి ముఠాగా ఏర్పడి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసేవారు.
రాత్రుళ్లు తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడేవారు. కాగా, అమర్ రాజ్‌కుమార్‌రెడ్డిపై ఉన్న 4 పెండింగ్ ఎన్‌బీడబ్ల్యూలను క్లియర్ చేశామని అడిషనల్ డీసీపీ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్. సైదాబాబు, ఎస్‌ఐలు కె. రామారావు, ఎం. మహేష్, కె. స్వామి, కానిస్టేబుల్ టి. ప్రశాంత్, కీసర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News