ఉద్యోగం పేరుతో యువకుడికి టోకరా
ABN , Publish Date - Mar 11 , 2026 | 07:18 AM
పార్ట్ టైమ్ ఆన్‌లైన్ ఉద్యోగం పేరుతో ఓ యువకుడిని మోసగించి సైబర్ మోసగాళ్లు రూ.3.80 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రూ.3.80 లక్షలు కాజేసిన నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: పార్ట్ టైమ్ ఆన్‌లైన్ ఉద్యోగం పేరుతో ఓ యువకుడిని మోసగించి సైబర్ మోసగాళ్లు రూ.3.80 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపన్‌పల్లి(Gopanpally) ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువకుడు టెలిగ్రామ్‌లో ‘శివాలి రోహేజా’ అనే వ్యక్తి పంపిన లింక్ ద్వారా ఒక గ్రూప్‌లో చేరాడు. దాని ద్వారా హై క్వాలిటీ లక్కీ ప్రాఫిట్ టాస్క్ గ్రూప్ గురించి తెలుసుకుని చేరాడు. అందులో ఇన్‌స్ట్రక్టర్ వివేక్ కుమార్ అనే వ్యక్తి పార్ట్‌టైమ్ ఆన్‌లైన్ టాస్క్‌ల ద్వారా డబ్బు సంపాదించవచ్చని మెసేజ్ పెట్టాడు.
అది చూసిన బాధితుడు మొదటగా రూ.2900 చెల్లించి టాస్క్ పూర్తి చేయగా, ఖాతాలో భారీ లాభాలు వచ్చినట్లు కనిపించాయి. దాంతో రెండు విడతల్లో రూ. 1,29,000 చొప్పున చెల్లించాడు. లాభాలను విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, మరో రూ.2.6 లక్షలు చెల్లించాల్సిందేనని మోసగాళ్లు షరతు విధించారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News