Share News

‘రాయనపాడు’ రాజసం!

ABN , Publish Date - Mar 11 , 2026 | 06:24 AM

భారతీయ రైల్వేస్టేషన్లలో రాయనపాడు శాటిలైట్‌ రైల్వే స్టేషన్‌ రాజసమే వేరబ్బా!.. అన్నట్లుగా ఎంతో అద్భుతంగా, సుందరంగా, శుభ్రంగా ఉందీ స్టేషన్‌!

‘రాయనపాడు’ రాజసం!

(ఆంధ్రజ్యోతి-ఇబ్రహీంపట్నం)

భారతీయ రైల్వేస్టేషన్లలో రాయనపాడు శాటిలైట్‌ రైల్వే స్టేషన్‌ రాజసమే వేరబ్బా!.. అన్నట్లుగా ఎంతో అద్భుతంగా, సుందరంగా, శుభ్రంగా ఉందీ స్టేషన్‌! ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇస్తున్నామా అనే భావన కలిగించేలా స్టేషన్‌ పరిసరాలున్నాయనడంలో అతిశయోక్తీ లేదు. ఈస్టేషన్‌ భవనం ముందు భాగం 90 మీటర్ల పొడువు, రెండున్నర అంతస్తుల ఎత్తులో ఉంది. ముందు భాగంలో కొండపల్లి బొమ్మల కళాకృతులు ఈప్రాంత కళకు అద్దం పట్టడమే కాకుండా.. కళ్లు తిప్పుకోకుండా చేస్తున్నాయి. స్టేషన్‌ లోపల మొత్తం గ్రానైట్‌తో తళ తళ మెరుస్తోంది.

Updated Date - Mar 11 , 2026 | 06:24 AM