ఈ దారి...పూల దారి
ABN , Publish Date - Mar 11 , 2026 | 06:27 AM
గులాబీ వర్ణంలో అరవిరిసిన పూలతో ఈ పింక్ ట్రంపెట్ చెట్లు విశాఖ నగరవాసులను మైమరిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: గులాబీ వర్ణంలో అరవిరిసిన పూలతో ఈ పింక్ ట్రంపెట్ చెట్లు విశాఖ నగరవాసులను మైమరిపిస్తున్నాయి. నగర పరిధిలోని షీలానగర్ నుంచి గాజువాక వెళ్లే మార్గంలో ఈ చెట్లకు పూసిన పూలు వాహనచోదకులకు కనువిందు చేస్తున్నాయి. జాతీయ రహదారిపై మధ్యలో నాటిన పింక్ ట్రంపెట్ చెట్లన్నీ పెరిగి పెద్దవై పూలు పూస్తున్నాయి. దాంతో ఈ మార్గం సరికొత్తగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి