నిబంధనల మార్పునకు ఎవరైనా ఒత్తిడి చేశారా?
ABN , Publish Date - Mar 11 , 2026 | 06:21 AM
కల్తీ నెయ్యి వ్యవహారంలో నిబంధనల మార్పునకు సంబంధించిన అంశాలపై ఏకసభ్య కమిషన్ దినేష్ కుమార్ దృష్టి సారించారు.
ఫైళ్లు పరిశీలిస్తున్న ఏకసభ్య కమిషన్
తిరుపతి(టీటీడీ), మార్చి 10(ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి వ్యవహారంలో నిబంధనల మార్పునకు సంబంధించిన అంశాలపై ఏకసభ్య కమిషన్ దినేష్ కుమార్ దృష్టి సారించారు. సిట్ సమర్పించిన నివేదికను ఆయన పరిశీలిస్తున్నారు. న్యాయస్థానానికి సిట్ సమర్పించిన చార్జిషీటుతో పాటు ప్రొక్యూర్‌మెంట్ విభాగం అధికారులు, టెండర్లు పిలిచే సమయంలో సంస్థల సామర్థ్యాన్ని పరిశీలించిన డెయిరీ నిపుణులు, ప్లాంట్లను పరిశీలించిన సభ్యుల స్టేట్‌మెంట్ వివరాలు పరిశీలిస్తున్నారు. నిబంధనల మార్పునకు అధికారులు, ఇతరులు ఎవరైనా ఒత్తిడి తీసుకువచ్చారా అనే విషయాలను ఆ స్టేట్‌మెంట్లలో పరిశీలిస్తున్నారు.