సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:57 PM
సంగారెడ్డి జిల్లాలోని కొల్లూర్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేట్టారు.
సంగారెడ్డి జిల్లా, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లాలోని కొల్లూర్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని కొల్లూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొల్లూర్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై డివైడర్ మధ్యలో చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను ఆటో ట్రాలీ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో ట్రాలీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. ట్యాంకర్ ద్వారా చెట్లకు నీళ్లు పడుతున్న మరో వ్యక్తి కూడా దుర్మరణం చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పఠాన్‌చెరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆటో ట్రాలీ డ్రైవర్ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క
ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News