Share News

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

ABN , Publish Date - Mar 06 , 2026 | 07:28 AM

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదుల మండల కేంద్రం సమీపంలో ఓ ఆటో ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి
Wanaparthy Road Accident

వనపర్తి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Wanaparthy Road Accident) జరిగింది. ఏదుల మండల కేంద్రం సమీపంలో ఓ ఆటో ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని వెంకటయ్య (50), సుమిత్ర (42)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వనపర్తి జిల్లా పోలీసులకు సమాచారం అందజేశారు.


పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానిక ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్రంప్‌నకు ఊరట.. యుద్ధ చర్యల నియంత్రణపై డెమోక్రాట్ల ప్రయత్నం విఫలం

కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు.. చమురు లీక్‌పై ఆందోళన

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 07:54 AM