Share News

పదేళ్ల పాటు సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంకుగా చూశారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ABN , Publish Date - Jul 13 , 2026 | 02:15 PM

సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిని అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు.

పదేళ్ల పాటు సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంకుగా చూశారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Union Minister Kishan Reddy

భద్రాద్రి, జులై 13: సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు(సోమవారం) కొత్తగూడెం క్లబ్‌లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇప్పటివరకు వేలం ద్వారానే బొగ్గు గనులు కేటాయిస్తూ వచ్చామని అన్నారు. మోదీ ప్రభుత్వం వేలం లేకుండా ఇచ్చిన ఏకైక బ్లాక్.. తాడిచర్ల-2 అని తెలిపారు. సింగరేణికి అండగా ఉండాలనే ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సింగరేణిని అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు.


సింగరేణిలో ప్రస్తుత పరిస్థితికి కారణం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో డబ్బులు తీసుకుని మైన్స్ కేటాయించారని ఆరోపించారు. కాంగ్రెస్ అక్రమంగా కేటాయించిన మైన్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని.. బొగ్గు గనులను పారదర్శకంగా కేటాయించాలని స్పష్టం చేసిందని తెలిపారు. సింగరేణిలో కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. సింగరేణిలో బొగ్గు మాయమైందని కేటీఆర్, హరీశ్ లేఖలు రాసినట్లు చెప్పారు. ‘సింగరేణి అంశంలో కేంద్రం తలదూర్చదని మీకు తెలియదా? మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు సింగరేణి డబ్బు ఖర్చు చేస్తారా? సింగరేణిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేశారు’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల పాటు సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంకుగా చూశారని వ్యాఖ్యానించారు. సింగరేణికి చేసిన మేలు ఏమిటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌పై మాత్రం కేసీఆర్ మాట్లాడలేదన్నారు. సింగరేణిలో ఏం జరిగినా కేంద్రాన్ని సంప్రదించడం లేదన్నారు. సింగరేణిపై కేంద్రం పెత్తనం ఉండదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

‘పార్టీ పేరు మార్చుకున్న చరిత్ర మీకే దక్కింది’.. కేసీఆర్‌పై ఎంపీ చామల సెటైర్

బనకచర్ల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తెలంగాణ అభ్యర్థనకు తిరస్కరణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 13 , 2026 | 02:21 PM