Share News

బనకచర్ల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తెలంగాణ అభ్యర్థనకు తిరస్కరణ

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:37 PM

బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు నిరాకరించింది.

బనకచర్ల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తెలంగాణ అభ్యర్థనకు తిరస్కరణ
Supreme Court

న్యూఢిల్లీ, జులై 13: బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా, ఈ పిటిషన్ నిబంధనలకు విరుద్ధంగా లిస్ట్ అయ్యిందంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒరిజినల్ సూట్ విషయంలో నిబంధనల ప్రకారమే విచారణకు రావాలని స్పష్టం చేసింది.


రిజిస్ట్రీ రూల్స్ ప్రకారం ఇటువంటి ఒరిజినల్ సూట్ పిటిషన్‌ను ముందుగా చాంబర్ జడ్జి ముందు దాఖలు చేయాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఆ ప్రక్రియ పూర్తికాకముందే ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా నేరుగా బెంచ్ ముందుకు విచారణకు రావడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అయితే, అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదననూ సుప్రీంకోర్టు పట్టించుకోలేదు.


ఇవి కూడా చదవండి..

శ్రీకాకుళం రోడ్డు ప్రమాదం.. అప్పలరాజు కుమారుడే బైక్‌ నడిపినట్లు పోలీసుల నిర్ధారణ

‘పార్టీ పేరు మార్చుకున్న చరిత్ర మీకే దక్కింది’.. కేసీఆర్‌పై ఎంపీ చామల సెటైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 13 , 2026 | 12:56 PM