Share News

షాబాద్ ఆరు హత్యల కేసు.. ఆ కారణంతోనే భార్య, పిల్లల హత్య..

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:06 PM

షాబాద్‌లో చోటుచేసుకున్న ఆరు హత్యల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విడాకులు ఇవ్వమని అడిగిందన్న కారణంతోనే నిందితుడు రాజ్‌కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడని సమాచారం.

షాబాద్ ఆరు హత్యల కేసు.. ఆ కారణంతోనే భార్య, పిల్లల హత్య..
Shabad case

రంగారెడ్డి, జులై 13: షాబాద్‌లో చోటుచేసుకున్న ఆరు హత్యల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విడాకులు ఇవ్వమని అడిగిందన్న కారణంతోనే నిందితుడు రాజ్‌కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడని సమాచారం. తన విచ్చలవిడి జీవితానికి అడ్డువస్తుందనే కారణంతో ఆమెను అడ్డు తొలగించుకునేందుకు ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజ్‌కుమార్, సరిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు..


రాజ్‌కుమార్ ఇంటర్మీడియట్ చదివే సమయంలో సరిత దగ్గరకు ట్యూషన్ చెప్పించుకోవడానికి వెళ్లాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధించటం మొదలెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సరిత తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలెట్టారు. సరితను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో రాజ్‌కుమార్ వచ్చిన సంబంధాలను చెడగొట్టాడు. వయసులో తనకన్నా ఆరేళ్లు పెద్దదైన సరితను 2018లో పెళ్లి చేసుకున్నాడు. డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న రాజ్‌కుమార్.. బెట్టింగులు, జూదం వంటి వ్యసనాలకు బానిస అయ్యాడు. రెండు కోట్ల రూపాయలు అప్పులు చేశాడు.


అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. చనిపోతానని బెదిరించటంతో అతడి తల్లిదండ్రులు కొంత పొలం అమ్మేసి అప్పులు తీర్చారు. ఆ తర్వాత తల్లిదండ్రులను నమ్మించి మొత్తం పొలం అమ్మేలా చేశాడు. జల్సాలకు, మద్యానికి బానిసైన రాజ్ కుమార్.. తరచూ మద్యం సేవించి సరితను వేధించేవాడు. రాజ్‌కుమార్ వేధింపులు తాళలేకపోయిన సరిత విడాకులు అడిగింది. దీంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి సరితను, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు.


ఇవి కూడా చదవండి

పౌరసత్వ నిర్ధారణ ప్రక్రియ న్యాయబద్ధంగా ఉండాలి.. అస్సాం ‘ఫారినర్స్’ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు!

వందల లీటర్ల పాలు రోడ్డుపై పారబోసిన వ్యాపారులు.. కారణం తెలిస్తే షాకే..!

Updated Date - Jul 13 , 2026 | 12:47 PM