శ్రీకాకుళం రోడ్డు ప్రమాదం.. అప్పలరాజు కుమారుడే బైక్ నడిపినట్లు పోలీసుల నిర్ధారణ
ABN , Publish Date - Jul 13 , 2026 | 09:54 AM
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి తానే కారణమంటూ సిద్దూ అనే యువకుడు పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.
శ్రీకాకుళం, జులై 13: కాశీబుగ్గలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి తానే కారణమంటూ సిద్దూ అనే యువకుడు పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు జరిపిన లోతైన విచారణలో అసలు నిజం బయటపడింది. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనాన్ని నడిపింది మాజీమంత్రి అప్పలరాజు కుమారుడు అరవ్ అని పోలీసులు నిర్ధారించారు.
శుక్రవారం (జులై 10) రాత్రి 9 గంటల సమయంలో కాశీబుగ్గలో జరిగిన ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టడంతో దానయ్య అనే గొర్రెల కాపరి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ప్రమాదం అనంతరం సిద్దూ అనే యువకుడు తానే బైక్ ప్రమాదానికి కారణమంటూ పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు సమీప పెట్రోల్ బంక్‌లో అప్పలరాజు కుమారుడు పెట్రోల్ పోయించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో తన కుమారుడి ఘనకార్యం బయటపడకుండా అప్పలరాజు మరో వ్యక్తితో డ్రామా నడిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం.. సహకరించే దేశాలను లక్ష్యాలుగా చేసుకుంటామని హెచ్చరిక!
Read Latest AP News And Telugu News