Share News

ఏపీ సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు.. ఓపీఎస్ ఎంపికకు వన్‌టైమ్ ఛాన్స్

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:05 PM

ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పాత పెన్షన్ విధానాన్ని ఎంచుకునేందుకు ఉద్యోగులకు ఒకేసారి అవకాశం ఇస్తూ జీవో విడుదల చేసింది.

ఏపీ సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు.. ఓపీఎస్ ఎంపికకు వన్‌టైమ్ ఛాన్స్
AP Govt

అమరావతి, జులై 13: ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) ఎంచుకునేందుకు ఉద్యోగులకు ఒకేసారి అవకాశం(One-time option) ఇస్తూ ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నెం.53ను(G.O.MS.No. 53) విడుదల చేసింది. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చి, ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారు అర్హులుగా ఉండనున్నారు. ఈ ఉద్యోగులు సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.


ఈ ఉత్తర్వుల ప్రకారం, జీవో జారీ అయిన తేదీ నుంచి మూడు నెలల లోపు అర్హులైన ఉద్యోగులు తమ ఆప్షన్‌ను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఒకసారి ఓపీఎస్ లేదా సీపీఎస్‌కు సంబంధించి ఉద్యోగి ఎంచుకున్న ఆప్షన్‌ను మార్చుకునే అవకాశం ఉండదని (Irrevocable) ప్రభుత్వం పేర్కొంది. గడువులోపు ఎలాంటి ఆప్షన్ ఇవ్వని ఉద్యోగులు యథావిధిగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) పరిధిలోనే కొనసాగుతారని జీవోలో స్పష్టం చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన జీవో ఎంఎస్ నెం. 53ను ఆర్థిక శాఖ అధికారికంగా విడుదల చేసింది.


ఇవి కూడా చదవండి..

ఏడు బస్సులు అగ్నికి ఆహుతి

శ్రీకాకుళం రోడ్డు ప్రమాదం.. అప్పలరాజు కుమారుడే బైక్‌ నడిపినట్లు పోలీసుల నిర్ధారణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 13 , 2026 | 12:47 PM