ఖమ్మం జిల్లాలో లారీని ఢీకొట్టిన బస్సు.. ప్రయాణికులకు గాయాలు
ABN , Publish Date - Sep 29 , 2026 | 07:50 AM
ఖమ్మం జిల్లాలో లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన వైరా మండలం సోమవరం గ్రామం గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ సమీపంలో జరిగింది.
ఖమ్మం జిల్లా, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లాలో లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన వైరా మండలం సోమవరం గ్రామం గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ సమీపంలో జరిగింది. ముందు వెళ్తున్న లారీని బస్సు ఢీ కొట్టడంతో బస్సు డ్రైవర్‌తోపాటు పలువురికి గాయాలయ్యాయి. దేవరపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఉదయం 3 గంటలకు వైరా ఎగ్జిట్ 4 వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని.. కుడి కాలు తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. పలువురు ప్రయాణికులకు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దిమ్మ తిరిగే రిజల్ట్స్ వస్తాయి: దానం నాగేందర్
భాగ్యనగరంలో మైకుల మోతపై నటుడు అల్లు శిరీశ్ ఫిర్యాదు
ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News