మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామంలో టెన్షన్..
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:44 PM
మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామం బీర్‌పూర్ బుధవారం రాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు అగ్రనేత ఢిల్లీలో లొంగిపోతున్నాడని వార్తలు రావడంతో గ్రామంలో ఒకేసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.
లొంగుబాటు వార్తలతో బీర్‌పూర్‌లో చర్చ
బీర్‌పూర్(జగిత్యాల): మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామం బీర్‌పూర్ బుధవారం రాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు అగ్రనేత ఢిల్లీలో లొంగిపోతున్నాడని వార్తలు రావడంతో గ్రామంలో ఒకేసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలోని వృద్ధులు, యువకులు, మహిళలు ఆసక్తితో టీవీల వద్ద కూర్చొని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఉపాధ్యాయుడిగా ఉండి ఉద్యమాల్లోకి వెళ్లిన గణపతి ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనే ఆత్రుతతో బీర్‌పూర్ ప్రజలు ఎదురుచూస్తున్నారు.
లొంగిపోవాలని గతంలోనే ‘అంతర్మథనం’
ముపాల లక్ష్మన్‌రావ్ అలియాస్ గణపతి లొంగిపోవాలని 2013లో బీర్‌పూర్ గ్రామంలో అప్పటి ఎస్పీ శివకుమార్ ఆద్వర్యంలో అంతర్మథనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసం దర్భంగా గ్రామంలో ఎస్పీ శివకుమార్ బస చేశారు. వేదికపై గణపతి లొంగిపోవాలని జనస్రవంతిలో కలవాలని ఎస్పీ ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
మార్చి మొదట్లోనే భానుడి భగభగలు.. ఎండలతో ప్రజల ఇబ్బందులు
Read Latest Telangana News and National News