పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
ABN , Publish Date - Mar 05 , 2026 | 10:14 AM
నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,64, 510 రూపాయలు..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,50,800 రూపాయలు..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 1,23,380 రూపాయలుగా ఉండింది.
ఇంటర్‌నెట్ డెస్క్: యుద్ధం కారణంగా బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. రోజురోజుకు తగ్గుతూ ఉన్నాయి. తాజాగా దేశీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. గురువారం ఉదయం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.980 తగ్గి.. రూ.1,63,530 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగానే తగ్గింది. 10 గ్రాములకు రూ.900 తగ్గి.. 1,49,900 పలుకుతోంది.
ఇక బుధవారం(నిన్న) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,64,510 రూపాయలు..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,50,800 రూపాయలు..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 1,23,380 రూపాయలు పలికింది. ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. ఫలితంగా దేశీయ మార్కెట్‌లో ధరలు భారీగా పతనం అయ్యాయి.
నేటి బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్ నగరంలో 24, 22,18 క్యారెట్ల బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ బంగారంపై 980 రూపాయలు.. 22 క్యారెట్ బంగారంపై 720 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 780 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,63, 530 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,49, 900 దగ్గర ట్రేడ్ అవుతోంది..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,22,650 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి
గణితంలో సిద్ధాంతాలు.. సైన్స్‌లో నైపుణ్యాలు
నానబెట్టిన మెంతులు డయాబెటిస్‌ను నిజంగా తగ్గిస్తాయా?