Share News

గొడ్డలితో తల్లిపై దాడి

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:37 PM

నిద్రిస్తున్న తల్లిపై కుమారుడు మద్యం మత్తులో గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

గొడ్డలితో తల్లిపై దాడి

  • పరిస్థితి విషమం.. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు

  • మహబూబాబాద్‌ జిల్లా చెర్లపాలెంలో ఘటన

తొర్రూరు(మహబుబాబాద్): నిద్రిస్తున్న తల్లిపై కుమారుడు మద్యం మత్తులో గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు కథనం ప్రకారం.. చెర్లపాలెం(Cherlapalem) గ్రామానికి చెందిన చిట్టిమల్ల లచ్చమ్మ (70) తన ఇంట్లో నిద్రిస్తోంది. మద్యం మత్తులో ఉన్న కుమారుడు అజీమ్‌ ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చి పక్కనే ఉన్న గొడ్డలితో తల్లి మెడపై, కాలు, చేతులు నరికాడు.


ఈ దాడిలో తీవ్ర గాయాలతో రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆమెకు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 108 సిబ్బంది వృద్ధురాలిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, లచ్చమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అజీమ్‌ మద్యానికి బానిస కావడంతో కొంతకాలం కిందటే భార్య వదిలేసి తల్లిగారింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఆయన ఏమీ పనిచేయకుండా మద్యం తాగుతూ తిరిగేవాడు. హత్య విషయం తెలుసుకున్న సీఐ గణేష్‌, ఎస్సై ఉపేందర్‌ సంఘటన స్థలానికి చేరుకొని అజీమ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ దాడికి గల పూర్తి వివరాలు సేకరిస్తున్నట్ల పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

మార్చి మొదట్లోనే భానుడి భగభగలు.. ఎండలతో ప్రజల ఇబ్బందులు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 05 , 2026 | 12:37 PM