ఇజ్రాయెల్‌తో యుద్ధం.. ఇరాన్‌కు సాయం చేస్తున్న చైనా, రష్యా?
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:32 AM
మొన్నటి వరకు సాధారణ వార్ డ్రోన్స్, మిస్సైల్స్ వాడిన ఇరాన్ ఇప్పుడు డోస్ పెంచింది. ఏకంగా బాలిస్టిక్ మిస్సైల్స్ క్యారీయింగ్ క్లస్టర్ మూనిషన్స్‌ను రంగంలోకి దించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ఆరవ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కూడా ఇరాన్‌పై దాడులు చేస్తోంది. ఇరాన్ మాత్రం ఒంటరిగానే పోరాడుతోంది. అయితే, మొన్నటి వరకు సాధారణ వార్ డ్రోన్స్, మిస్సైల్స్ వాడిన ఇరాన్ ఇప్పుడు డోస్ పెంచింది. ఏకంగా బాలిస్టిక్ మిస్సైల్స్ క్యారీయింగ్ క్లస్టర్ మూనిషన్స్‌ను రంగంలోకి దించింది. ఇజ్రాయెల్ భూభాగంపై అత్యంత అధునాతన, శక్తివంతమైన వీటిని ప్రయోగించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మిలటరీ అధికారులు స్వయంగా వెల్లడించారు.
క్లస్టర్ వార్‌హెడ్ మిస్సైల్స్ ప్రత్యేకత ఏంటి?
సాధారణ మిస్సైల్స్ టార్గెట్‌ను చేరుకుని పేలిపోతాయి. వీటి ప్రభావం కొంత వరకు మాత్రమే ఉంటుంది. కానీ, క్లస్టర్ వార్‌హెడ్ మిస్సైల్స్ అలా కాదు. క్లస్టర్ వార్‌హెడ్ మిస్సైల్స్ లోపల చిన్న చిన్న బాంబులు చాలా ఉంటాయి. ఆ మిస్సైల్ లక్ష్యాన్ని చేరిన తర్వాత మిస్సైల్ లోనుంచి చిన్న చిన్న బాంబులు బయటకు వస్తాయి. ఆ చిన్న బాంబులు మరింత ఎక్కువ ప్రదేశాన్ని కవర్ చేస్తాయి. పేలుడు తీవ్రత కొన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే క్లస్టర్ వార్‌హెడ్ మిస్సైల్స్‌తో విధ్వంసం చాలా దారుణంగా ఉంటుంది.
ఇరాన్‌కు ఈ టెక్నాలజీ ఎక్కడిది?
ఇరాన్ ప్రయోగించిన క్లస్టర్ వార్‌హెడ్ మిస్సైల్స్ కారణంగా ఇజ్రాయెల్‌లో భయం మొదలైంది. ఇరాన్ ప్రయోగిస్తున్న క్లస్టర్ వార్‌హెడ్ మిస్సైల్స్ ఏకంగా 80 చిన్న బాంబులను రిలీజ్ చేస్తున్నాయని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అత్యంత అధునాతనమైన ఈ క్లస్టర్ వార్‌హెడ్ మిస్సైల్స్ అమెరికా, రష్యా, చైనా, ఇండియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇజ్రాయెల్ మిలటరీ ఉన్నతాధికారులు చెబుతున్న దాని ప్రకారం.. క్లస్టర్ వార్‌హెడ్ మిస్సైల్స్‌ను తయారు చేసుకునే టెక్నాలజీ ఇరాన్ దగ్గర లేదు. చైనా లేదా రష్యాలు ఇరాన్‌కు సాయం చేసి ఉండొచ్చు.
ఇవి కూడా చదవండి