Share News

రెండు రోజులు నీటి సరఫరా బంద్‌

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:12 AM

వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్‌ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు.

రెండు రోజులు నీటి సరఫరా బంద్‌

మెదక్‌: వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్‌ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పెద్దరెడ్డిపేట వద్ద పైప్‌లైన్‌ లీకేజీ మరమ్మతులు, రాయిపహాడ్‌ వద్ద స్లూయి్‌సవాల్స్‌ రిపేర్లు, సివిల్‌ పనులు, సంపులు శుభ్రపరచడం తదితర నిర్వహణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు పూర్తిచేయడం కోసం సింగూరు(Singoor) నుంచి జిల్లాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు.


srd2.2.jpgమెదక్‌ నియోజకర్గంలోని 275 నివాస ప్రాంతాలు, మెదక్‌, రామాయంపేట మున్సిపాలిటీలు, అందోల్‌ నియోజకవర్గంలోని అల్లాదుర్గం, టేక్మాల్‌ మండలాల్లోని 80 నివాస ప్రాంతాల పరిధిలో నేడు, రేపు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వేసవి నిర్వహణ పనుల కోసం చేపడుతున్న ఈ పనులను గుర్తించి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

జనం ప్రాణాలతో జగన్‌ చెలగాటం!

ఏప్రిల్‌ 24, 25 తేదీల్లో కవిత కీలక సమావేశం!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 05 , 2026 | 11:12 AM