Share News

గాంధీ విగ్రహానికి అవమానం

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:33 AM

మెదక్‌ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానపరిచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పట్టణం నడిబొడ్డున ఉన్న రాందాస్‌ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు పేడ పూసి పరారయ్యారు.

గాంధీ విగ్రహానికి అవమానం

  • పేడ పూసిన దుండగులు

  • మెదక్‌ పట్టణ నడిబొడ్డున ఘటన

  • నిందితుల కోసం పోలీసుల గాలింపు

మెదక్‌: మెదక్‌ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానపరిచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పట్టణం నడిబొడ్డున ఉన్న రాందాస్‌ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు పేడ పూసి పరారయ్యారు. బుధవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. రోజూలాగే ఉదయం చౌరస్తాకు చేరుకున్న స్థానికులు విగ్రహానికి పేడ పూసి ఉండటాన్ని గమనించారు. వెంటనే మున్సిపల్‌ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.


అనంతరం మున్సిపల్‌ సిబ్బంది విగ్రహాన్ని శుభ్రం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన మహాత్ముడి విగ్రహాన్ని అవమానించడంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రాత్రి వేళల్లో నిఘా లేకపోవడం వల్లే దుండగులు రెచ్చిపోతున్నారని, ప్రధాన కూడళ్లలో పహారా పెంచాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

ఏప్రిల్‌ 24, 25 తేదీల్లో కవిత కీలక సమావేశం!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 05 , 2026 | 11:33 AM