తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:59 AM
రేవంత్ రెడ్డికి బీజేపీ అంటే భయమని.. తెలంగాణలో త్వరలోనే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని కేంద్ర సహాయక మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
కరీంనగర్, నవంబరు 22: రేపు కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే మహా పాదయాత్రను అడ్డుకుంటే గట్టిగా సమాధానం చెప్తామని బండి సంజయ్ హెచ్చరించారు. కాగా.. ఈ యాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ పాల్గొననున్నారు. ఈ మేరకు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘బీజేపీ అంటే రేవంత్ రెడ్డికి భయం. బీజేపీని తట్టుకునే దమ్ము బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు లేదు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ ఎలా ప్రత్యర్థి అవుతుందో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్.. రేవంత్ రెడ్డికి ప్రత్యర్థినా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అని రేవంత్ వ్యాఖ్యలతో అర్థం అయింది. తెలంగాణలో త్వరలోనే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. రేపు కరీంనగర్‌లో జరగబోయే మహాపాద యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే.. గట్టిగా సమాధానం చెబుతాం’ అంటూ బండి సంజయ్ హెచ్చరించారు. ఈ మేరకు స్పందిస్తూ.. ‘సర్’ ప్రక్రియను ఎదుర్కొనేవాళ్లంతా దేశద్రోహులు అని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
హెలికాప్టర్ల నుంచి తూటాల వర్షం.. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అరెస్టు
పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..