Share News

పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..

ABN , Publish Date - Nov 21 , 2026 | 10:01 AM

పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దదని, ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ భారీ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో రికార్డు సృష్టించడంపై ఆయన ప్రశంసలు కురిపించారు.

పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..
Dario Amodei, Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దదని, ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ భారీ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో రికార్డు సృష్టించడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఆ సంస్థ సీఈఓ డారియో అమోడీపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. అలాగే అమెరికాలో ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి అనుమతులు ఆలస్యం చేస్తే, కంపెనీలు ఇతర దేశాలకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు (Trump about Anthropic IPO).


ఏఐ అనేది పారిశ్రామిక విప్లవం కంటే పెద్దదని, తాను కూడా ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. ఆంథ్రోపిక్ ఐపీఓ రికార్డు సృష్టించిందని, ఏఐ రంగంలో అమెరికా అగ్రస్థానాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే భారీ మౌలిక సదుపాయాలు అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఏఐ మోడళ్ల శిక్షణ, నిర్వహణ కోసం డేటా సెంటర్లు కీలకమని చెప్పారు. డేటా కేంద్రాల నిర్మాణానికి స్థానికంగా అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటే, కంపెనీలు ఇతర దేశాలకు వెళ్లి తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయని హెచ్చరించారు (Trump AI Revolution).


ప్రపంచంలోని అనేక దేశాలు ఏఐ సంస్థలను ఆకర్షించేందుకు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు (US AI Industry). అమెరికాలోనే ఈ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని, ఉద్యోగాలు సృష్టించాలని ట్రంప్ ఆకాంక్షించారు. అనుమతుల విషయంలో అనవసర జాప్యం జరిగితే దేశానికి ఆర్థికంగా నష్టం కలగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంథ్రోపిక్ సంస్థ నవంబర్ 19న నాస్‌డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అడుగుపెట్టింది. ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద ఐపీఓగా ఇది నిలిచింది.


ఇవి కూడా చదవండి..

భారత్‌ను చూసి నేర్చుకోండి.. అమెరికా వడ్డీ రేట్లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 21 , 2026 | 10:01 AM