హెలికాప్టర్ల నుంచి తూటాల వర్షం.. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అరెస్టు
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:51 PM
మెక్సికోలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఫాస్టో ఇసిడ్రో మెజా ఫ్లోరెస్‌ను అరెస్టు చేసేందుకు అక్కడి మిలిటరీ శుక్రవారం భారీ ఆపరేషన్‌కు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: మెక్సికోలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఫాస్టో ఇసిడ్రో మెజా ఫ్లోరెస్‌ను అరెస్టు చేసేందుకు అక్కడి మిలిటరీ శుక్రవారం భారీ ఆపరేషన్‌కు నిర్వహించింది. ఈ క్రమంలో హెలికాఫ్టర్ల నుంచి క్రిమినల్స్‌పై తూటాల వర్షం కురిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాకు భారీ స్థాయిలో డ్రగ్స్‌ను అక్రమంగా తరలించే మెజా-ఫ్లోరెస్ గ్యాంగ్‌కు ఇసిడ్రో ఫ్లోరెస్ బాస్. ఫ్లోరెస్‌ను పరారీలో ఉన్న నేరగాడిగా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఇప్పటికే ప్రకటించింది.
మెక్సికోలోని సినలోవా ప్రావిన్స్‌లోగల గువాసేవ్ ప్రాంతంలో దాక్కున్న అతడిని పట్టుకునేందుకు మిలిటరీతో పాటు పోలీసు సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఫ్లోరెస్ ముఠా సభ్యులు ఏకంగా మిలిటరీపై కాల్పులకు దిగడంతో సైన్యం దీటుగా జవాబిచ్చింది. ఏకంగా హెలికాప్టర్లతో వారిపై తూటాల వర్షం కురిపించింది. ఫ్లోరెస్‌ను మెక్సికో సైన్యం అరెస్టు చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న ప్రభుత్వ దళాలపై కాల్పులు జరిగినసట్టు స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు.
ఫ్లోరెన్స్ ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్ డాలర్ల నజరానా ఇస్తామని ఎఫ్‌బీఐ ఇప్పటికే ప్రకటించింది. అమెరికాలోకి భారీ మొత్తంలో హెరాయిన్, మెథాంఫిటమైన్, కొకెయిన్, ఫెంటనైల్, గంజాయ్ వంటివి అక్రమంగా తరలించినందుకు ఫ్లోరెస్‌పై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. ప్రత్యర్థి గ్యాంగులపై ఆధిపత్యం కోసం ఫ్లోరెస్ ప్రమాదకరమైన గ్యాంగ్‌వార్‌లకు తెరతీశాడని అమెరికా అధికారులు పేర్కొన్నారు. 2024లో గుసావే ప్రాంతంలో మెక్సికో మిలిటరీ టన్ను బరువుల ఫెంటనైల్‌ను స్వాధీనం చేసుకుంది. ఇంత భారీ స్థాయిలో ఫెంటనైల్ లభించడం ఆ దేశంలో అదే తొలిసారి.
ఈ వార్తలనూ చదవండి:
పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..
పుతిన్ ఓ హంతకుడు.. ట్రంప్ వ్యాఖ్యలకు జెలెన్‌స్కీ కౌంటర్..