Share News

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల కోసం జనం పరేషాన్‌

ABN , Publish Date - Sep 02 , 2026 | 01:42 PM

స్మార్ట్‌ రేషన్‌కార్డుల్లోని తప్పులను చూసి జనం తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 3,21,740 మందికి స్మార్ట్‌రేషన్‌కార్డులను పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతోంది.

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల కోసం జనం పరేషాన్‌

  • రేషన్‌ దుకాణాల నంబర్లతో కార్డులు జారీ

  • ఎవరు.. ఎక్కడ ఇస్తారో తెలియని పరిస్థితి

  • అస్తవ్యస్తంగా పంపిణీ

కరీంనగర్‌ టౌన్‌: స్మార్ట్‌ రేషన్‌కార్డుల్లోని తప్పులను చూసి జనం తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 3,21,740 మందికి స్మార్ట్‌రేషన్‌కార్డులను పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతోంది. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కార్డుల పంపిణీ ప్రక్రియ చిన్నచిన్న ఇబ్బందులతో సాగుతుంటే, కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. నగరంలోని 66 డివిజన్లలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ శానిటేషన్‌ విభాగంలోని జవాన్లకు అప్పగించి రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకున్నారు.


  • అంతా గందరగోళం..

పాత రేషన్‌కార్డుల మాదిరిగా కుటుంబ యజ మానురాలి పేరుతోపాటు ఇంటి నంబరు, కాలనీ పేరు, షాపు నెంబరుతో కార్డులు తయారుచేస్తే బాగుండేదని లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి మూడు నెలల కోటా బియ్యం మొత్తం పంపిణీ చేశారని, మూడు నెలల తర్వాత కొత్త కార్డు ఉంటేనే బియ్యం ఇస్తారా లేదా, ఒక వేళ కార్డు ఇవ్వకుంటే తమ పరిస్థితి ఏమిటని లబ్దిదారులు ఆందోళన చెందుతు న్నారు. ఇప్పటి వరకు నగరంలోని కొన్ని డివిజన్లలోనే స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ జరుగుతోంది.


కొన్ని చోట్ల అసలు ఎప్పుడు, ఎవరు, ఎక్కడ పంపిణీ చేస్తారో, వార్డు కార్యాలయాల్లో ఇస్తారో, ఇంటింటికి తెచ్చి ఇస్తారో తెలియక ప్రజలు అయోమ యానికి గురవుతున్నారు. కొందరు కార్పొ రేటర్లు వారి సమీప డివిజన్లలోని జవాన్లందరిని పిలి పించి దుకాణాల వారీగా విభజించి పంపిణీ చేస్తు న్నారు. కొన్ని చోట్ల అసలు కార్పొరేటర్లు పట్టించు కోకుండా జవాన్ల వద్దకు వెళ్లాలని చెబు తుండడంతో రేషన్‌కార్డుల పంపిణీ గందరగోళంగా మారింది.


card1.2.jpg

  • ఇంటి నంబర్లు లేక ఇబ్బందులు

స్మార్ట్‌రేషన్‌కార్డులపై లబ్దిదారు పేరు, కాలనీపేరు, రేషన్‌ దుకాణాల నంబర్లను మాత్రమే ముద్రించారు. ఈ కార్డులపై ఇంటి నంబర్లు లేక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో డివిజన్‌లో రెండు, మూడు రేషన్‌షాపులుండడం, కొన్ని చోట్ల రెండు, మూడు డివిజన్లకు కలిపి ఒకే దుకాణముంది. కార్డుపై ఉన్న నంబరును చూసి సంబంధిత దుకాణాల్లోనే కార్డులను పంపిణీ చేస్తే ఇబ్బందులు ఉండేవి కావు. కార్డుపై ఇంటి నంబర్‌ లేకపోవడంతో జవాన్లు లబ్ధిదారులను గుర్తించడం కష్టంగా మారింది.


వాటిని ఎక్కడ, ఎవరికి ఇవ్వాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్లలో కార్డులను పంపిణీ చేస్తారని ప్రకటించడంతో కార్పొరేటర్ల వద్దకు వచ్చి తమ కార్డు రాలేదని, ఎక్కడ ఇస్తారని, ఎప్పుడు ఇస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల జవాన్లు వారికి తెలిసిన ముఖాలను చూసి కార్డులను పంపిణీ చేస్తుండగా, కొత్తగా రేషన్‌కార్డులు వచ్చిన వారికి ఏ దుకాణం తమకు కేటాయించారో, ఎక్కడ కార్డు ఇస్తారో తెలియడం లేదని అధికారులు, కార్పొరేటర్ల చుట్టూ తిరుగుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఇక అంతా ఆన్‌లైన్‌లోనే..

చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 02 , 2026 | 01:42 PM