Share News

నాంపల్లి గుట్టకు శ్రావణ సందడి

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:58 PM

సింహం నిద్రిస్తున్న తీరుతో ఎంతో మహిమాన్వితంగా, ప్రకృతి అందాలతో నాంపల్లి గుట్ట పర్యాటకులను ఆకర్షిస్తోంది.

నాంపల్లి గుట్టకు శ్రావణ సందడి
Nampally Gutta, Vemulawada

  • భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న క్షేత్రం

  • గుట్ట చుట్టూ నాలుగు హనుమాన్‌ రాతిశిలా విగ్రహాలు

  • ఆకర్షణీయంగా కాళీయమర్థనం

వేములవాడ(సిరిసిల్ల): సింహం నిద్రిస్తున్న తీరుతో ఎంతో మహిమాన్వితంగా, ప్రకృతి అందాలతో నాంపల్లి గుట్ట పర్యాటకులను ఆకర్షిస్తోంది. గుట్ట మధ్య భాగంలో ఐదు తలలతో నిర్మించిన కాళీయమర్థనం, తలపై శ్రీ కృష్ణుడి నృత్య రూపం, చుట్టూ పచ్చని పంటపొలాలు, ఉత్తరాన మూలవాగు అందాలు, దక్షిణాన మానేరువాగు అందాలు, తూర్పున మానేరు వాగు, మూలవాగు కలిసే మధ్యమానేరు డ్యామ్‌ బ్యాక్‌వాటర్‌ వ్యూ భక్తులు, పర్యాటకులను ఇట్టే కట్టి పడేస్తుంది నాంపల్లి గుట్ట. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న నాంపల్లి లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీతో సందడిగా మారింది. రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు లక్ష్మీనృసింహ స్వామి వారిని దర్శించుకుని అక్కడ విడిది చేస్తేనే యాత్ర సంపూర్ణం అవుతుందని భావిస్తారు.


ఆకర్షణీయంగా కాళీయమర్థనం..

నాంపల్లి గుట్టపైకి వెళ్లే మార్గంలో మధ్యభాగాన 2003లో అప్పటి కేంద్ర సహాయమంత్రి చెన్నమనేని విద్యా సాగర్‌రావు ఐదు తలల సర్పాకారంలో ఉన్న కాళీయ మర్థనం నిర్మాణాన్ని చేపట్టారు. పాముపైన శ్రీ కృష్ణుడు నృత్యం చేస్తు న్నట్లు వెనుకభాగం లో పచ్చటి పంట పొలాలతో ఆకర్షణీ యంగా చూపరు లను ఆకట్టుకుం టుంది. సొరంగం లో ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుని కథను తెలిపే శిల్పాలు, స్తంభం నుంచి నరసిం హుడు బయటకు వస్తున్న ఘట్టం, చివరిలో హిరణ్యకశిపుని సంహరిస్తున్న విగ్రహం భక్తులకు కనువిందు చేస్తాయి.


కాళీయమర్థనం లోపల ఉగ్రనృసింహస్వామి విగ్ర హంతోపాటు నాగదేవత విగ్రహాలున్నాయి. భక్తులు స్వామి వారిని దర్శించుకుని నాగదేవతకు పాలతో అభిషేకం చేసి నాగదేవతను వేడుకుని మొ క్కులు చెల్లించుకుంటారు.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన భారీ విమానాన్ని తీసుకువచ్చి గుట్టపైన అ మర్చేందుకు పనులు జరుగుతున్నాయి. గుట్టపైకి వచ్చిన భక్తులు, సందర్శకులు విమానం వద్ద సెల్ఫీలు దిగుతూ సందడిగా చేస్తున్నారు.


ఎలా చేరుకోవాలి...

వేములవాడ బస్టాండ్‌ నుంచి 4.5 కిలోమీటర్ల దూరంలో నాంపల్లి గుట్ట ఉంటుంది. కరీంనగర్‌ నుంచి 32 కిలోమీటర్ల దూరం ఉండగా, ఆలయ సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. ప్రతి ఏటా నరసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి, శ్రావణ మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


vmd1.2.jpgశావణ మాసం బియ్యం సమర్పణ..

వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి క్షేత్ర పాలకుడు అయిన స్వామివారికి ప్రతి యేటా ఆయా గ్రామాల ప్రజలు బియ్యం సమర్పించే ఆనవాయితీ కొనసాగుతోంది. శ్రావణ మాసం సందర్భంగా భక్తులు ఉపవాస దీక్ష చేపట్టి నాంపల్లి లక్ష్మీనృసింహస్వామికి కొత్త బియ్యం, చింతపండు, కూరగాయలతో కలిపి ఆలయంలోని అర్చకులకు బియ్యాన్ని అందిస్తారు. కొని తిరిగి ఇచ్చిన బియ్యాన్ని భక్తులు ఇంటికి తీసుకువెళ్లి తమ బియ్యంలో కలుపుకుంటారు. దీంతో సంవత్సరం అంత పాడి పంటలు, పిల్లపాపలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని భక్తులు ఎంతగానో నమ్ముతారు.


భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న క్షేత్రం..

  • ఉపప్రధాన అర్చకుడు రామాచార్యులు..

వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన నాంపల్లి లక్ష్మీనృసింహ స్వామి ఆలయానికి భక్తులు గోవిందా.. గోవిందా.. అంటూ మెట్లు ఎక్కుతూ ఆలయానికి చేరుకుంటారు. గోవిందా.. అనే పదంతో వారి బాధలు, కష్టాలు, నష్టాలు అన్ని తొలగి పోతాయని నమ్ముతారు. ప్రతి సంవత్సరం భక్తులు కొత్త బియ్యం, కూరగాయలు, పంట సామగ్రి తీసుకువచ్చి సమర్పిం చడం పురాతనం నుంచి ఆనవాయితీగా వస్తోంది.


చిన్నతనంలో ఎడ్ల బండ్లపై వెళ్లేవాళ్లం..

  • నాగుల అంజయ్య, సంకెపల్లి, భక్తుడు

నాంపల్లి గుట్టపైకి ప్రతి సంవత్సరం బియ్యం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వస్తాము. మా తాతల కాలం నుంచి ఆలయానికి వస్తున్నాం. స్వామికి బియ్యం సమర్పించి వంటలు చేసుకుని భోజనం చేసి వెళుతాం. మా సంకెపల్లి గ్రామం నుంచి నా చిన్నతనంలో రుద్రవరం, ఆరెపల్లి, కొదురుపాక, వెంకట్రావుపల్లి గ్రామాల నుంచి భక్తులు ఎడ్లబండ్లపై ఆలయానికి వచ్చేవారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఇక అంతా ఆన్‌లైన్‌లోనే..

చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 02 , 2026 | 12:58 PM