Share News

తమిళనాట ప్రముఖ ఆలయాల్లో సెల్‌ఫోన్లపై నిషేధం..

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:59 AM

తమిళనాడులో విజయ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 52 ప్రధాన ఆలయాలలో స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై టీవీకే ప్రభుత్వం పూర్తి స్థాయి నిషేధాన్ని విధించింది.

తమిళనాట ప్రముఖ ఆలయాల్లో సెల్‌ఫోన్లపై నిషేధం..
Tamil Nadu temple mobile ban

చెన్నై, సెప్టెంబర్ 2: తమిళనాడులోని దేవాలయాల్లో రీల్స్ చిత్రీకరించే యువతకు బుద్ధి చెప్పేందుకు విజయ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 52 ప్రధాన దేవాలయాలలో స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై టీవీకే ప్రభుత్వం పూర్తి స్థాయి నిషేధాన్ని విధించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1, 2026 (మంగళవారం) నుంచే అమలులోకి వచ్చాయి. మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.


హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ మంత్రి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆలయాలలో కొంతమంది భక్తులు, ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాల కోసం రీల్స్ చేస్తున్నారు. అలా వీడియోలు తీయడం వల్ల ఆలయ పవిత్రత దెబ్బతింటోంది. ఇతర భక్తుల ప్రశాంతతకు భంగం కలుగుతోంది. అందుకే ఈ చర్యలు చేపట్టాము’ అని తెలిపారు.


సెల్‌ఫోన్ల కోసం ప్రత్యేక కౌంటర్లు..

భక్తులు తమ స్మార్ట్‌ఫోన్లను ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో భద్రపరచాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫోన్‌కు 5 రూపాయల చొప్పున డిపాజిట్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కెమెరాలేని కీప్యాడ్ మొబైల్ ఫోన్లను ఆలయంలోనికి తీసుకెళ్లడానికి అనుమతి ఉంది.


ఇవి కూడా చదవండి

ఆ వైపు వెళ్లవద్దు.. ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ జెలెన్‌స్కీ వార్నింగ్

సీఎస్కే కోచ్‌ విషయంలో అప్పుడే తొందరెందుకు?: రుతురాజ్ గైక్వాడ్

Updated Date - Sep 02 , 2026 | 12:50 PM