Share News

గుడివాడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. 48 గ్రాముల బంగారం రికవరీ

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:30 PM

కృష్ణా జిల్లాలోని గుడివాడలో బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు 48 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో గండికోట శివపార్వతి ఇంట్లో భారీ చోరీ జరిగింది.

గుడివాడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. 48 గ్రాముల బంగారం రికవరీ
Gudivada gold theft

కృష్ణాజిల్లా, సెప్టెంబర్ 2: జిల్లాలోని గుడివాడలో బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు 48 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో గండికోట శివపార్వతి ఇంట్లో భారీ చోరీ జరిగింది. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. త్వరతగతినే చోరీ చేసిన నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు మోటూరుకు చెందిన తాడిపర్తి అశోక్‌కుమార్‌గా గుర్తించారు. అతడి వద్ద నుంచి రూ.4.20 లక్షల విలువైన 48 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్‌లో బంగారు ఆభరణాలను రికవరీ చేసుకున్నారు.


ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ సోమేశ్వరరావు మీడియాకు తెలియజేశారు. రికవరీ చేసిన బంగారు ఆభరణాలను మీడియా ముందు ప్రదర్శించారు. చోరీ జరిగినట్లు ఫిర్యాదు అందిన వెంటనే రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. రూ.4.20 లక్షల విలువైన 48 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని సీఐ చెప్పారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసును సత్వరమే ఛేదించిన రూరల్ సీఐ సోమేశ్వరరావు, ఎస్‌ఐ చంటిబాబు, సీసీఎస్ ఎస్‌ఐ సత్యనారాయణ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.


ఇవి కూడా చదవండి...

గొల్లగుప్ప ఘటనపై సమగ్ర విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం

టీటీడీ డిప్యూటీ ఈవో నివాసంలో ఏసీబీ సోదాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 02 , 2026 | 12:45 PM