ఇందిరాభవన్‌కు మహేశ్ గౌడ్, మీనాక్షి.. సురేఖ అంశం చర్చించే ఛాన్స్ ఉందన్న టీపీసీసీ చీఫ్
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:09 AM
కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీలోని ఇందిరాభవన్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు కేసీ వేణుగోపాల్‌తో నేతలు భేటీ కానున్నారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇందిరాభవన్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు కేసీ వేణుగోపాల్‌తో నేతలు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇందిరాభవన్ వద్ద మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీకి వచ్చామని.. ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు.
కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలుస్తున్నట్లు చెప్పారు. సంస్థాగత అంశాలు,1000 రోజుల కాంగ్రెస్ పాలనపై కేసీ వేణుగోపాల్‌తో చర్చిస్తామన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తామని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్
కేటీఆర్ మహాధర్నా.. ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News And Telugu News