Share News

కేటీఆర్ మహాధర్నా.. ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Sep 02 , 2026 | 10:41 AM

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్ రేపు మహాధర్నాకు సిద్ధమయ్యారు. అయితే మాజీ మంత్రి మహాధర్నా వేళ పట్టణంలో ఫ్లెక్సీల కలకలం రేగింది.

కేటీఆర్ మహాధర్నా.. ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
Miryalaguda political news

నల్లగొండ, సెప్టెంబర్ 2: జిల్లాలోని మిర్యాలగూడలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్ రేపు(గురువారం) మహాధర్నాకు సిద్ధమయ్యారు. రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఉంచాలనే ప్రధాన ఉద్దేశంతో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాకు కేటీఆర్ హాజరుకానున్నారు. అయితే రేపు మిర్యాలగూడలో మాజీ మంత్రి ధర్నా వేళ పట్టణంలో ఫ్లెక్సీల కలకలం రేగింది. పదేళ్ల బీఆర్‌ఎస్ వైఫల్యాలు..1000 రోజుల్లో కాంగ్రెస్ వికాసం పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి.


కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్‌ఎస్ మహాధర్నా చేపట్టాలని నిర్ణయించగా.. గత పదేళ్ల వైఫల్యాలపై ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పదేళ్ల పాలనలో నల్గొండ జిల్లా ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం చేసిందని విమర్శలు గుప్పిస్తూ పట్టణంలో కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్లకార్డులతో కాంగ్రెస్ శ్రేణులు రేపు నిరసన వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. ​కేటీఆర్ పర్యటన వేళ ఫ్లెక్సీల ఏర్పాటుతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.


ఇవి కూడా చదవండి...

గొల్లగుప్ప ఘటనపై సమగ్ర విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం

గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 02 , 2026 | 10:48 AM