గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్
ABN , Publish Date - Sep 02 , 2026 | 10:21 AM
పోలవరం జిల్లా గొల్లగుప్ప గ్రామంలో క్లోరో క్వీన్ మాత్రలు వికటించి అస్వస్థతకు గురైన బాధితులు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్ రెడ్డి స్పందించారు.
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 2: పోలవరం జిల్లా గొల్లగుప్ప గ్రామంలో క్లోరో క్వీన్ మాత్రలు వికటించి అస్వస్థతకు గురైన బాధితులు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్ రెడ్డి స్పందించారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. గొల్లగుప్ప క్లోరో క్వీన్ బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. వాంతులతో ఆస్పత్రికి వచ్చిన ఏడేళ్ల బాలిక జమున అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.
కార్డియాక్ సమస్యలు ఉన్న వారికి క్లోరో క్వీన్ టాబ్లెట్ వికటించే అవకాశం ఉందని ఆయన అన్నారు. చిన్నారి జమున పోస్టుమార్టం నివేదికలో మృతికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు. అలాగే బాధితుల్లో కోలుకున్న వారిని ఈరోజు సాయంత్రానికి డిశ్చార్జ్ చేయనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు
గొల్లగుప్ప ఘటనపై సమగ్ర విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం
Read Latest Telangana News And Telugu News