ఛార్జ్‌షీట్ కాదు దమ్ముంటే చర్చకు రండి.. కేటీఆర్, హరీశ్‌కు మంత్రి అడ్లూరి సవాల్
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:28 AM
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు సంబంధించి బీఆర్‌ఎస్ ఛార్జ్‌షీట్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి లిస్ట్‌ను మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు వాట్సాప్‌లో పంపిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు సంబంధించి బీఆర్‌ఎస్ ఛార్జ్‌షీట్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈరోజు(బుధవారం) ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి లిస్ట్‌ను మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు వాట్సాప్‌లో పంపిస్తున్నట్లు చెప్పారు. ఛార్జ్‌షీట్ కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్‌లో అబద్ధాలు మాత్రమే ఉన్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను హరీశ్ రావు, కేటీఆర్, కేసీఆర్‌కు రిపోర్ట్ పంపిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వెయ్యి రోజుల పాలనపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను అమలు చేస్తూనే కొత్త పథకాలు కూడా ఇస్తున్నామని చెప్పారు. ‘మాకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. అప్పుడే కేటీఆర్‌కు తొందర ఎందుకు’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 2014-18 మ్యానిఫెస్టో, కాంగ్రెస్ 2023 మ్యానిఫెస్టోపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. ‘మీ పదేళ్ల పాలన, మా రెండున్నరేళ్ల పాలనపై దమ్ముంటే చర్చకు రండి’ అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ చేశారు.
ఇవి కూడా చదవండి...
కేటీఆర్ మహాధర్నా.. ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
ఇందిరాభవన్‌కు మహేశ్ గౌడ్, మీనాక్షి.. సురేఖ అంశం చర్చించే ఛాన్స్ ఉందన్న టీపీసీసీ చీఫ్
Read Latest Telangana News And Telugu News