Share News

టీటీడీ డిప్యూటీ ఈవో నివాసంలో ఏసీబీ సోదాలు

ABN , Publish Date - Sep 02 , 2026 | 09:59 AM

తిరుపతిలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

టీటీడీ డిప్యూటీ ఈవో నివాసంలో ఏసీబీ సోదాలు
ACB Raids

తిరుపతి, సెప్టెంబర్ 2: తిరుపతిలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈరోజు(బుధవారం) ఉదయం పెదకాపు వీధిలోని లోకనాథం నివాసంతోపాటు సమీపంలో ఉన్న ఆయన పెద్ద బావమరిది, చిన్న బావమరిది ఇళ్లలోనూ అధికారులు సోదాలు చేపట్టారు. ​చెల్లూరు గ్రామంలో లోకనాథం బంధువు నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే ​తిరుమలలోని ‘బి టైప్ 53’ నంబరు గల గెస్ట్ హౌస్‌లో తనిఖీలు నిర్వహించారు.


ఎస్టీవీ నగర్ (STV Nagar) బ్రాంచ్‌లోని ఎస్‌బీఐ(SBI) బ్యాంక్‌‌లో లోకనాథంకు లాకర్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం లోకనాథం టీటీడీ డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్నారు. అలాగే తిరుమల ఆలయానికి సంబంధించిన కీలక బాధ్యతలను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. గతంలో టీటీడీ అధికారుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసిన పరిస్థితి లేదు. ఇదే మొట్టమొదటిసారి. ఇలాంటి విషయాల్లో శాఖాపరమైన చర్యలు తీసుకోవడమే తప్ప.. టీటీడీ ఉద్యోగుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయడంతో తోటి ఉద్యోగుల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది.


ఇవి కూడా చదవండి...

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు

గొల్లగుప్ప ఘటనపై సమగ్ర విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 02 , 2026 | 11:46 AM