Share News

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి..

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:59 AM

వంటింట్లో ‘ఉల్లి’ కోయకముందే కన్నీళ్లు తెప్పిస్తోంది. కొద్దిరోజులుగా ఉల్లి ధర పెరుగుతూ వస్తోంది.

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి..
onion price

  • కిలో ఉల్లి ధర రూ.80

సిరిసిల్ల: వంటింట్లో ‘ఉల్లి’ కోయకముందే కన్నీళ్లు తెప్పిస్తోంది. కొద్దిరోజులుగా ఉల్లి ధర పెరుగుతూ వస్తోంది. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉల్లి ధర కిలో రూ.80కి చేరింది. జూలై మాసంలో కిలో ఉల్లిగడ్డ నుంచి రూ.20 నుంచి రూ.25 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో రూ.75నుంచి రూ.80వరకు అమ్ముతున్నారు. ఏ వంట అయినా ఉల్లితోనే మొదలవుతుంది. తప్పనిసరిగా ఉప యోగించే ఉల్లిగడ్డల ధరలు పెరగడంతో సామాన్య కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.


onion1.jpgహోటళ్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు ఉల్లి వినియోగిం చడం తగ్గించారు. మరోవైపు ఉల్లిదోశ వంటివి తాత్కాలికంగా నిలిపివేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో ఉల్లి పంట దెబ్బతినగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులతో దిగుబడి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఉల్లి ధర బాగా పెరిగిందని తెలు స్తోంది. సామాన్య ప్రజలకు ఉపశమనంగా ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిగడ్డల సరఫరా చేయాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నేను జగిత్యాల ‘మంచినీళ్ల బావి’ని..

‘మహాలక్ష్మి’కి మస్త్‌ డిమాండ్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 11:59 AM