Share News

3 రాష్ట్రాలు, ఒక యూటీలో 6 స్థానాలకు నేడు బైపోల్స్

ABN , Publish Date - Oct 06 , 2026 | 08:41 AM

దేశంలోని మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో 6 స్థానాలకు శనివారం ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజినగర్, తమిళనాడులోని మధురాంతకం, ధర్మపురం, పుదుచ్చేరిలోని తట్టంచవాడి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా.. అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికి బైపోల్ జరగనుంది.

3 రాష్ట్రాలు, ఒక యూటీలో 6 స్థానాలకు నేడు బైపోల్స్

ఇంటర్‌నెట్ డెస్క్: దేశంలోని మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో 6 స్థానాలకు శనివారం ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజినగర్, తమిళనాడులోని మధురాంతకం, ధర్మపురం, పుదుచ్చేరిలోని తట్టంచవాడి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా.. అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికి బైపోల్ జరగనుంది. ఆ స్థానాల్లో అంతకుముందు గెలిచిన అభ్యర్థులు తమ పదవులకు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరడం, లేదా రెండు చోట్ల పోటీచేసి గెలవడంతో ఒక స్థానాన్ని వదులుకోవడం వంటి కారణాలతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.


కాగా.. బెంగాల్, తమిళనాడులో జరుగుతున్న ఉప ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. బెంగాల్‌లో టీఎంసీ రెండు వర్గాలు చీలిన నేపథ్యంలో ఆ పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం సీజ్ చేసింది. అలాగే, ఈ ఏడాది ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీకి ఈ ఉప ఎన్నికలు కీలకంగా మారాయి. ముఖ్యంగా నందిగ్రామ్‌లో బీజేపీ తరపున సీఎం సువేందు అధికారి మాజీ సహాయకుడు చంద్రనాథ్ రథ్ తల్లి హసిరాణి రథ్ బరిలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రనాథ్ హత్యకు గురయ్యారు. అలాగే, కాంగ్రెస్ నుంచి మిలన్ ప్రధాన్ బరిలో నిలిచారు. ఆయనకు మమతా బెనర్జీ నేత‌ృత్వంలోని టీఎంసీ మద్దతు తెలిపింది. టీఎంసీ ఫ్యాక్షన్ తరపున మొహమ్మద్ ఇతేషాముల్ హక్ పోటీ చేస్తున్నారు. ఇక రెజినగర్‌లో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ రెండు వర్గాలు, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీలు పోటీ చేస్తున్నాయి.


ఆసక్తికరంగా తమిళనాడు..

తమిళనాడులోని మధురాంతకం, ధర్మపురంలో టీవీకే అభ్యర్థులుగా అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు కె.మరగతం కుమారవేల్, పి.సత్యభామ పోటీచేస్తున్నారు. ఆ ఇద్దరూ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. తర్వాత తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఆ రెండు నియోజకవర్గాల్లో టీవీకేతో పాటు, డీఎంకే, అన్నాడీఎంకే, సీపీఐ అభ్యర్థులు బరిలో నిలిచారు. మధురాంతకంలో 27 మంది పోటీ చేస్తుండగా.. ధర్మపురంలో 30 మంది పోటీ చేస్తున్నారు. ఇక ఆ ఎన్నికల ఫలితాలు ఈనెల 9న వెలువడతాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

సౌదీ రక్షణకు తుర్కియే, పాకిస్థాన్ బలగాలు..

వాళ్ల దగ్గర భారీగా అణ్వాయుధాలున్నాయి..

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 06 , 2026 | 09:09 AM