మిల్లుల మూత.. ఉపాధికి వెత...
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:17 PM
సమస్యలు పరిష్కరించాలని జిల్లాలోని రైస్‌మిల్లర్లు మిల్లులు మూసివేశారు. విల్లులపై ఆధార పడిన కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఉపాధి లేక కార్మికుల ఇబ్బందులు
సమస్య పరిష్కారానికి మిల్లర్ల ఎదురుచూపులు
రాయితీలు విడుదల చేయాలని మిల్లర్ల డిమాండ్
సుల్తానాబాద్(కరీంనగర్): సమస్యలు పరిష్కరించాలని జిల్లాలోని రైస్‌మిల్లర్లు మిల్లులు మూసివేశారు. విల్లులపై ఆధార పడిన కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 150 బాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. సమస్యలు పరిష్కరించాలని మిల్లర్లు ఈనెల 7వ తేదీ నుంచి మిల్లుల బంద్ పాటిస్తున్నారు. విద్యుత్ ఖర్చులు నాలుగు రెట్ల పెరుగుదల, సార్టెక్స్, గ్రేడర్ల, ఎఫ్‌ఆర్‌కే బియ్యం తదితర నిబంధనల వల్ల 450 హెచ్‌పీ నుంచి 600 హెచ్‌పీ విద్యుత్ సామర్థ్యంతో మిల్లులు నడుపుతున్నందున నిర్వహణ భారం పెరిగిందని, మిల్లింగ్ చార్జీలు ప్రభుత్వం పెంచడం లేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశా బ్దాల కిందట ఉన్న ధర ఇస్తున్నారని, అయినా నష్టాలను భరిస్తూ కార్మికులకు ఉపాధి చూపుతున్నామని మిల్లర్లు పేర్కొంటున్నారు.
గోదాముల్లో స్థల సమస్య
జిల్లాలోని గోదాముల్లో మిల్లింగ్ అవుతున్న బియ్యాన్ని ఎఫ్‌సీఐ త్వరగా సేకరించడం లేదని, మిల్లుల్లో నెలవారి మిల్లింగ్ సామర్థ్యంలో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే డెలి వరీ అవుతున్నాయని, మిగిలిన 22 రోజులు మిల్లులు ఖాళీగా ఉంటున్నాయని వ్యాపారులు పేర్కొన్నారు. బ్యాంక్ వడ్డీలు, సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ చార్జీలు భారంగా మారి మిల్లులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయని వాపోతు న్నారు. ఎఫ్‌సీఐ అధికారులు అనవసరపు కొర్రీల మూలంగా లారీ కిరాయిలు ఇతరత్రా నష్టపోతున్నామని పేర్కొంటున్నారు.
మిల్లర్లపై కొందరు కావాలని ప్రభుత్వానికి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామ 15 ఏళ్ళుగా యేటా 80 నుంచి 90 లక్షల మంది రైతులకు మద్థతుగా నిలుస్తూ దాదాపు పది కోట్ల టన్నుల ధాన్యాన్ని జీరో నష్టం లేకుండా ప్రభుత్వానికి మిల్లింగ్ చేశామని పేర్కొంటున్నారు. 2022-23 సీజన్‌కు సంబంధించి నాలుగు వేల కోట్ల భారాన్ని మిల్లర్లు భరించారు. రబీ బాయిల్డ్ రైస్ సంక్షోభ సమయంలో ప్రభుత్వం ధాన్యం సేకరణ చేయగా, మిల్లర్లు నాలుగు వేల కోట్లు చెల్లించి యాభై శాతం పైగా ధాన్యాన్ని టెండర్ ద్వారా తీసుకున్నామని,
రెండేళ్ళ గడువు పూర్తయినా వంద శాతం పేమెంట్ చేసిన మిల్లర్లకు రావలిసిన చార్జీలు, రాయితీలు ప్రభుత్వం విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలోని గోదాముల్లో రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని రెండేళ్ల పాటు నిల్వ చేయడం వల్ల గోదాముల కిరాయిలు, హమాలీ చార్జీలు, తేమ తగ్గడం వల్ల క్వింటాలుకు 18 నుంచి 25 శాతం వరకు నష్టం వచ్చిందని, మిల్లర్లు ప్రభుత్వానికి వన్ పర్సంట్ నష్టం రానివ్వకుండా, వంద శాతం ధాన్యం అమౌంట్‌ను సొంత ఖర్చులతో చెల్లించి నిబద్దత చాటుకున్నామని మిల్లర్లు వివరిస్తున్నారు.
2025 -26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 20 లక్షల టన్నుల ధాన్యం పది నెలలుగా మిల్లర్ల వద్దనే నిల్వ ఉంటుంది. కేవలం 70 శాతం డెలివరీకి ఆర్డర్లు ఇచ్చి మిగిలిన ఐదు లక్షల టన్నుల కు ఇప్పటి వరకు ఆర్డర్లు లేకుండా పోయాయని మిల్లర్ల పేర్కొంటున్నారు. పది నెలల పాటు మిల్లుల్లో ధాన్యం నిలువ ఉండడం వల్ల వచ్చే సహజ బరువు తగ్గుదలను మిల్లర్లపై తోయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం ఇచ్చే సమయంలో బాయిల్డ్ రైస్‌గా అనుమతిస్తామని చెప్పి ఇప్పుడు బలవంతంగా రా రైస్ కింద ఇవ్వమనడం సరికాదని, ఎండల తీవ్రత వల్ల రా రైస్ బాయిల్డ్ చేస్తే ఇరవై శాతం కూడా బియ్యం కావని మిల్లర్లు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలి
నగునూరి అశోక్ కుమార్, జిల్లా అధ్యక్షులు, రైస్ ఇండస్ట్రీస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
క్షేత్రస్థాయిలో పడుతున్న కష్టనష్టాలను ప్రభుత్వం దృష్టికి తేవ డానికే మిల్లుల బంద్ కొనసాగిస్తున్నాం. నిబంధనల ప్రకారం నడు స్తున్న మిల్లర్లపై విజిలెన్స్ దాడులు, కేసులు నమోదు చేయడం విచారకరం. మిల్లర్లపై కొందరు కావాలని ప్రభుత్వానికి తప్పుడు సమాచారాం అందిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా స్పందించి చర్యలకు ఉపక్రమించాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
పదేళ్లుగా అవే.. మారని వీవో కమిటీలు
హైదరాబాద్‌లో లిఫ్ట్ గుంతలో పడి పెయింటర్ మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News