హోటల్‌లో గంజాయి విక్రయం.. ఇద్దరి అరెస్ట్
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:51 AM
భాగ్యనగంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16: భాగ్యనగంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్(Special Task Force) అధికారులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఓ హోటల్‌లో గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. నిందితులు హోటల్‌లో చిన్న చిన్న ప్యాకెట్లుగా గంజాయిని విక్రయిస్తున్నట్లు ఎస్‌టీఎఫ్ అధికారులు తెలిపారు. అస్సాంకు చెందిన ధీరజ్ దాస్ (39), రబాలి అలీ(25)ని అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారి వద్ద నుంచి రూ.9 లక్షలు విలువైన 17.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వీరిద్దరూ గతంలో హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసినట్లు విచారణలో తేలింది. జీతం సరిపోకపోవడంతో గంజాయి విక్రయాల వైపు మళ్లినట్లు ఎక్సైజ్ విచారణలో బయటపడింది. అస్సాం నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆపై నిందితులిద్దరినీ కొండాపూర్ ఎక్సైజ్ పోలీసులకు ఎస్‌టీఎఫ్ అధికారులు అప్పగించారు.
ఇవి కూడా చదవండి...
ఇంధన పొదుపుతో దేశానికి మరింత భద్రత: భట్టి విక్రమార్క
ఆ ఇద్దరూ కలిసి మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారు: మంత్రి శ్రీధర్ బాబు
Read Latest Telangana News And Telugu News