ఆ ఇద్దరూ కలిసి మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారు: మంత్రి శ్రీధర్ బాబు
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:23 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మధ్య మంచి సమన్వయం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మధ్య మంచి సమన్వయం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు(బుధవారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఉండాలని తాము అనుకున్నామని.. అయితే సభలో ఉండొద్దనే ఎత్తుగడతోనే బీఆర్ఎస్ సస్పెన్షన్‌కు గురైందని విమర్శించారు. అసెంబ్లీ అంటే బీఆర్ఎస్ పార్టీకి నచ్చదంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ రోజులు సభను నడపలేదన్నారు. ఇప్పుడు తాము సభ నడిపితే ఉండడం లేదంటూ బీఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి...
అర్ధరాత్రి పోకిరీల హల్‌చల్.. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్‌తో హంగామా
ఇంధన పొదుపుతో దేశానికి మరింత భద్రత: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And Telugu News