అర్ధరాత్రి పోకిరీల హల్‌చల్.. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్‌తో హంగామా
ABN , Publish Date - Sep 16 , 2026 | 09:57 AM
హైదరాబాద్‌లో అర్ధరాత్రి పోకిరీలు హల్‌చల్ చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌మెంట్ డీమార్ట్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ యువకులు హంగామా చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16: నగరంలో అర్ధరాత్రి పోకిరీలు హల్‌చల్ చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌మెంట్ డీమార్ట్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ యువకులు హంగామా చేశారు. రోడ్డుపై వేగంగా కార్లు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. రోడ్లపై స్టంట్లు చేస్తూ, ర్యాష్ డ్రైవింగ్‌తో ఇతర వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. పోకిరీల హంగామాపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఇంత జరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.
అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్‌కు అడ్డుకట్ట ఎప్పుడు వేస్తారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోకిరీలపై రాజేంద్రనగర్ డీసీపీ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు
Read Latest Telangana News And Telugu NEws