Share News

హుజూరాబాద్‌లో ఆధిపత్య పోరు

ABN , Publish Date - May 29 , 2026 | 01:04 PM

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో ముసలం ప్రారంభమైంది. గెలిచి మూడు నెలలు దాటకముందే కౌన్సిలర్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.

హుజూరాబాద్‌లో ఆధిపత్య పోరు
Huzurabad Municipality

  • కౌన్సిల్‌ సమావేశంలో పలు అభివృద్ధి పనులకు కౌన్సిలర్ల ఆమోదం..

  • వెంటనే తాము కొన్ని పనులను ఆమోదించలేదని ఫిర్యాదు

హుజూరాబాద్‌(కరీంనగర్): హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో ముసలం ప్రారంభమైంది. గెలిచి మూడు నెలలు దాటకముందే కౌన్సిలర్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. రెండు రోజుల క్రితం హుజూరాబాద్‌ మున్సిపాలిటీ లో 4.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ఆమోదానికి కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిలర్లు పలు పనులకు అమోదం తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత 30 మంది కౌన్సిలర్లలో 19 మంది ఒక ప్రకటన విడుదల చేశారు.


కొన్ని పనులకే ఆమోదం తెలిపామని, మిగితా వాటికి తెలపలేదన్నారు. దీంతో మున్సి పాలిటీలో ఏం జరుగుతుందోనని చర్చ నీయాంశంగా మారింది. హుజూరాబాద్‌ మున్సిపాలిటీని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కొన్ని రోజులు సమావేశాలు సాదా సీదా గా జరిగాయి. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవుల్లో కాంగ్రెస్‌కు చెందిన వారే ఉండగా, వారి మధ్య సయోధ్య లేక పోవడంతో గ్రూప్‌ రాజకీయాలు తయారయ్యాయి.


కాంగ్రెస్‌ కౌన్సిలర్లతో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కూడా తోడయ్యారు. తాము గెలిచి మూడు నెలలు దాటినా వార్డుల్లో తట్టెడు మట్టి కూడ పోయలేదని, జనరల్‌ ఫండ్‌ నుంచి నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. వైస్‌ చైర్‌పర్సన్‌ను వేదికపైకి పిలవకపోవడంతోనే కౌన్సిలర్ల మధ్య విభేదాలు వచ్చాయని పలువురు అనుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మాజీలు డీలా.. కేడర్‌ గోల..!

పిల్లల కిడ్నీలో రాళ్లు !

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 29 , 2026 | 01:04 PM