Share News

సోనియా, రాహుల్ గాంధీలతో సిద్దరామయ్య భేటీ..

ABN , Publish Date - May 29 , 2026 | 10:37 AM

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్దరామయ్య ఈరోజు (శుక్రవారం) కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తన రాజీనామా, కర్ణాటక నూతన కేబినెట్‌ కూర్పు, రాష్ట్ర నాయకత్వంలో మార్పు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.

సోనియా, రాహుల్ గాంధీలతో సిద్దరామయ్య భేటీ..
Rahul Gandhi and Siddaramaiah

ఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్దరామయ్య ఈరోజు (శుక్రవారం) కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సీఎం పదవికి రాజీనామా, కర్ణాటక నూతన కేబినెట్‌ కూర్పు, రాష్ట్ర నాయకత్వంలో మార్పు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. గురువారం నాడు రాజీనామా అనంతరం సిద్దరామయ్యను ఢిల్లీకి రాహుల్ గాంధీ ఆహ్వానించారు. ఈ మేరకు అల్పాహార విందులో ఆయన పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్ఠానం ముందు సిద్దరామయ్య పలు డిమాండ్లు ఉంచినట్లు సమాచారం. సిద్దరామయ్యను రాజ్యసభకు పంపించేందుకు రాహుల్ ప్రయత్నిస్తుండగా.. ఎమ్మెల్యేగానే కొనసాగుతానని ఆయన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని, రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని రాహుల్ గాంధీకి చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశంలో సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర, కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సూర్జేవాలా పాల్గొన్నారు.


భేటీ అనంతరం సూర్జేవాలా మీడియాతో మాట్లాడారు. కర్ణాటక రాజకీయ అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. కేబినెట్ కూర్పులో ఎలాంటి ఇబ్బందులు లేవని సూర్జేవాలా తెలిపారు. కాగా, మరికాసేపట్లో రాహుల్‌తో డీకే శివకుమార్ సమావేశం కానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురి మృతి..

ఇంట్లో పేలిన ఏసీ.. మాజీ ఐఏఎస్ కన్నుమూత

Updated Date - May 29 , 2026 | 11:49 AM